జాతీయ వార్తలు

మళ్లీ ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 4: పాత నోట్లు జమ చేసుకోవడానికి సహేతుకమైన కారణాలు చూపించే నిజాయితీపరులకు మరో అవకాశం ఇవ్వాలని కేంద్రం, ఆర్బీఐకి మంగళవారం సుప్రీంకోర్టు సూచించింది. ఇందుకు సంబంధించి రెండు వారాల్లో మార్గనిర్దేశనం చేయాలని కోరింది. 500, వెయ్యి నోట్ల రద్దుపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాద్యాన్ని చీఫ్ జస్టిస్ జెఎస్ ఖెహెర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. అనివార్య కారణాలవల్ల నిర్ణీత సమయంలో రద్దయిన నోట్లను జమ చేసుకోలేకపోయిన వ్యక్తుల కోసం కేంద్రం ఎలాంటి ఏర్పాట్లు చేసిందని సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్‌ను కోర్టు ప్రశ్నించింది. ‘రద్దయిన నోట్లు జమ చేసుకోవాల్సిన సమయంలో ఒక వ్యక్తి జైల్లో ఉండివుంటే, అలాంటి వ్యక్తి రద్దయిన నోట్లను ఎలా జమ చేస్తాడు. అలాంటి వాళ్ల కోసం కేంద్రం ఆ తరువాతైనా ఎలాంటి ఏర్పాట్లు చేసింది’ అంటూ న్యాయమూర్తులు ప్రశ్నించారు. అలాంటి కొన్ని ప్రత్యేకాంశాలను దృష్టిలో పెట్టుకుని, సహేతుకమైన కారణాలు చూపగలిగే నిజాయితీపరులకు మరో అవకాశం ఇవ్వాలని కేంద్రం, ఆర్బీఐకి సూచించింది. అనివార్య కారణాల వల్ల రద్దయిన పెద్ద నోట్లు జమ చేసుకోలేకపోయిన తనకు అవకాశం కల్పించాలని కేంద్రం, ఆర్బీఐని ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సుధా మిశ్రా కేసు సహా మరికొన్ని పిటిషన్లను సుప్రీం ధర్మాసనం సోమవారం విచారించింది. గత నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించటం తెలిసిందే. డిసెంబర్ 30లోగా రద్దయిన నోట్లను బ్యాంకులు, పోస్ట్ఫాసులు, ఆర్బీఐ వద్ద జమ చేసుకోవచ్చంటూ అవకాశమిచ్చింది. నిర్ణీత గడువులో రద్దయిన నోట్లు జమ చేసుకోలేని వ్యక్తులు, ఈ ఏడాది మార్చి 31లోగా ఆర్బీఐలో జమ చేసుకోవచ్చంటూ మరో అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.