జాతీయ వార్తలు

భారీ మెజారిటీయే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 4: ఎన్‌డిఏ రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌ను మూడింట రెండింతల మెజారిటీతో గెలిపించుకునేందుకు బిజెపి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే దాదాపు అరవై ఐదు శాతం ఓట్లను పదిలం చేసుకున్న బిజెపి ఇప్పుడు లోక్‌సభ, రాజ్యసభకు చెందిన ఇండిపెండెంట్ సభ్యులతోపాటు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఇండిపెండెంట్ శాసనసభ్యుల మద్దతు కూడగట్టుకునేందుకు బిజెపి అధినాయకత్వం పావులు కదుపుతోంది. లోక్‌సభకు చెందిన ముగ్గురు ఇండిపెండెంట్ సభ్యులు, రాజ్యసభకు చెందిన ఐదుగురు ఇండిపెండెంట్ సభ్యులతోపాటు సమాజ్‌వాదీ నుండి సస్పెండైన అమర్‌సింగ్ ఓటును సంపాదించుకునేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. దేశంలోని 31 రాష్ట్రాల శాసనసభల్లో ఉన్న ఇండిపెండెట్ సభ్యుల వివరాలను తెప్పించుకున్న బిజెపి అధినాయకత్వం వారితో మాట్లాడవలసిందిగా రాష్ట్ర బిజెపి అధ్యక్షులను ఆదేశించింది. ఇండిపెండెంట్లతోపాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన శాసనసభ్యులు ఎవరైనా కోవింద్ అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు గల అవకాశాలను కూడా పరిశీలించాలని రాష్ట్ర అధ్యక్షులకు సూచించినట్లు తెలిసింది. లోక్‌సభలో ముగ్గురు ఇండిపెండెంట్లు ఉన్నారు. అస్సాంలోని కొక్రాజార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి గెలిచిన నభా కుమార్ సరిన్యా, కేరళలోని ఇడుక్కి లోక్‌సభ నియోజకవర్గం నుండి విజయం సాధించిన జాయిస్ జార్జ్ రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని సమర్థించేందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు. అమర్‌సింగ్ కూడా తన ఓటు రామ్‌నాథ్ కోవింద్‌కేనని ప్రకటించారు. రాజ్యసభలోని ఇండిపెండెంట్ సభ్యులు కర్నాటకకు చెందిన రాజీవ్ చంద్రశేఖర్, ఒడిశాకు చెందిన ఏవి స్వామి, హర్యానాకు చెందిన జీ టీవి మీడియా బ్యారెన్ సతీష్ చంద్ర, జార్ఖండ్‌కు చందిన పరిమళ్ నథ్వానీ, సంజయ్ దత్తాత్రేయ కక్డే బిజెపి అభ్యర్థికే ఓటు వేయాలని నిర్ణయంచుకోవటంతో రామ్‌నాథ్ బలం గణనీయంగా పెరుగుతుందని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు త్రిపుర శాసన సభ్యులు బిజెపి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని బలపరచనున్నట్లు ప్రకటించారు. తమతోపాటు మరికొందరు టిఎంసి శాసనసభ్యులు కోవింద్‌కు అనుకూలంగా ఓటు వేస్తారని వారు చెబుతున్నారు. రామ్‌నాథ్ కోవింద్‌కు ఓటు వేస్తామని ప్రకటించిన ఈ త్రిపుర శాసనసభ్యులను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీనుండి సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీతోపాటు కాంగ్రెస్‌కు చెందిన పలువురు శాసన సభ్యులు బిజెపి అభ్యర్థికి ఓటు వేయనున్నట్లు తెలిసింది. సమాజ్‌వాదీ పార్టీ అధినాయకుడు ములాయం సింగ్ యాదవ్ ఇదివరకే కోవింద్‌కు మద్దతు ప్రకటించటం తెలిసిందే. 403 సీట్లున్న యుపి అసెంబ్లీలో సమాజ్‌వాదీకి 47, బిఎస్‌పికి 19, కాంగ్రెస్‌కు ఏడుగురు శాసన సభ్యులున్నారు. ఈ మూడు పార్టీలకు చెందిన పలువురు శాసన సభ్యులు ఎన్‌డిఏ అభ్యర్థి కోవింద్‌కు ఓటు వేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఢిల్లీలో కూడా రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు పెరుగుతోంది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లుంటే ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ బలం 62. అయితే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో ఏర్పడిన విభేదాల మూలంగా పలువురు ఆమ్ ఆద్మీ శాసన సభ్యులు బిజెపి అభ్యర్థికి ఓటు వేయవచ్చునని అంటున్నారు. ఢిల్లీ శాసనసభలోని ముగ్గురు ఇండిపెండెంట్ సభ్యుల్లో కపిల్ మిశ్రా, పంకజ్ పుష్కర్ల ఓట్లు బిజెపి అభ్యర్థికే పడతాయని అంటున్నారు.

చిత్రాలు.. మంగళవారం హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహిస్తున్న ఎన్డీయే రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుసుకున్న తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు
*ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కోల్‌కతా చేరుకున్న యుపిఏ రాష్టప్రతి అభ్యర్థి మీరాకుమార్