జాతీయ వార్తలు

పశ్చిమ బెంగాల్‌లో మత ఉద్రిక్తతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూలై 4: పశ్చిమబెంగాల్ లోని ఉత్తర 24పరగణాల జిల్లాలో తీవ్రస్థాయిలో మత సంఘర్షణలు చెలరేగాయి. పరిస్థితి అదుపు తప్పటంతో 400మంది బిఎస్‌ఎఫ్ జవాన్లను రాష్ట్రప్రభుత్వం హుటాహుటిన తరలించింది. ఫేస్‌బుక్‌లో వచ్చిన ఓ అభ్యంతరకర పోస్టుతో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పింది. ఈ అల్లర్లలో ఎంతమంది మరణించారన్న దానిపై అధికారికంగా ఎలాంటి వివరాలు లేకపోయినా ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీకి మధ్య అనూహ్యరీతిలో వివాదం రగుల్కొంది. బిజెపి బ్లాక్ అధ్యక్షుడిగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని, తనను బెదిరించి అవమానించారంటూ ఇంతకుముందు మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలపై రాజ్‌భవన్ తీవ్రంగానే స్పందించింది. మమత ధోరణి, ఆమె వాడిన భాష విస్మయకరంగా ఉందని స్పష్టం చేసిన రాజ్‌భవన్ ‘‘రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తుంటే గవర్నర్ చూస్తూ ఊరుకోలేరు’’ అని తేల్చి చెప్పింది. ఫేస్‌బుక్ పోస్ట్‌తో తలెత్తిన ఉద్రిక్తతలు క్షణాల్లో ఇతర ప్రాంతాలకు విస్తరించాయని, పరిస్థితి అదుపు తప్పకుండానే జవాన్లను తరలించామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.