జాతీయ వార్తలు

లాలూకు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 7: ఆఠ్‌జెడి అధినేత, మాజీ రైల్వే మంత్రి లాలూప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి కేసు నమోదు చేసిన సిబిఐ శుక్రవారం పాట్నా సహా 12 చోట్ల దాడులు జరిపింది. ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ దాడులు పాట్నా, రాంచి, భువనేశ్వర్ సహా 12 ప్రాంతాల్లో జరిగినట్లు సిబిఐ అదనపు డైరెక్టర్ రాకేష్ ఆస్తానా ఇక్కడ విలేఖరుల సమావేశంలో చెప్పారు. భారత శిక్షాస్మృతి(ఐపిసి)లోని నేరపూరిత కుట్ర(120-బి), చీటింగ్ (420), అవినీతి చట్టం కింద ఈ కేసు నమోదు చేసినట్లు ఆస్తానా తెలిపారు. లాలూప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో పూరీ, రాంచీలోని భారతీయ రైల్వేకు చెందిన బిఎన్‌ఆర్ హోటళ్లను ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టేందుకు కుట్ర జరిగిందని ఆయన చెప్పారు. ఈ హోటళ్లను మొదట ఐఆర్‌సిటిసికి బదిలీ చేయడం జరిగిందని, ఆ తర్వాత వీటి కార్యకలాపాల నిర్వహణకోసం పాట్నాలోని సుజాతా హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఓ ప్రైవేటు సంస్థకు లీజ్‌కు ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ హోటళ్లను బదిలీ చేసినందుకు గాను ఆ సంస్థ పశ్చిమ పాట్నాలోని అత్యంత విలువైన మూడెకరాల భూమిని లాలూప్రసాద్ కుటుంబానికి చెందిన డిలైట్ మార్కెటింగ్‌కు అతి తక్కువ ధరకు ఇచ్చిందని, దరిమిలా 2010, 2014 మధ్య కాలంలో ఈ భూమిని లాలూయాదవ్ కుటుంబానికే చెందిన మరో సంస్థ లారా ప్రాజెక్ట్స్‌కు బదిలీ చేయడం జరిగిందని ఆస్తానా వివరించారు. ఈ బదిలీ కూడా చాలా తక్కువ ధరకే జరిగిందని, భూమి విలువ మార్కెట్ ధర 32 కోట్లు కాగా, కేవలం 65 లక్షలకే లారా ప్రాజెక్ట్స్‌కు బదిలీ చేశారని ఆయన చెప్పారు. ఈ వ్యవహారంపై ప్రాథమిక దర్యాప్తు కొనసాగించిన తర్వాత ఈ నెల 5న కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. లాలూప్రసాద్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, మాజీ కేంద్ర మంత్రి అపేమ్‌చంద్ గుప్తా భార్య సరళా గుప్తా సహా సుజాతా హోటల్స్ డైరెక్టర్లు విజయ్ కొచార్, వినయ్ కొచార్, లారా ప్రాజెక్ట్స్‌గా అందరికీ తెలిసిన డిలైట్ మార్కెటింగ్ కంపెనీ, అప్పటి ఐఆర్‌సిటిసి మేనేజింగ్ డైరెక్టర్ పికె గోయల్‌లను ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా పేర్కొన్నారు.