జాతీయ వార్తలు

కృష్ణా ట్రిబ్యునల్ విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 7: ఉమ్మడి ఏపీ కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు 26 విస్తృత అంశాల అధారంగా విచారణ కొనసాగించేందుకు కృష్ణా ట్రిబ్యునల్ నిర్ణయించింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతిపాదించిన అంశాలపై ట్రిబ్యునల్‌లో శుక్రవారం నాడు వాదనలు ముగిసాయి. జస్టిస్ బ్రీజేష్ కుమార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ తదుపరి విచారణను సెప్టెంబరు 13వ తేదీకి వాయిదా వేసింది. అయితే నీటి కేటాయింపులకు సంబంధించిన విచారణాంశాలపై అదనపు పత్రాలను ఆగస్టు 16లోపు రెండు రాష్ట్రాలు సమర్పించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఆంధ్రా 11, తెలంగాణ 16 విచారణ అంశాలను ప్రతిపాదించాగా, ఇందులో ఏపీ ప్రతిపాదించిన 11 అంశాల్లో ఒక దాన్ని ట్రిబ్యునల్ తిరస్కరించింది. కృష్ణా జలాల పంపిణీలో 26 విచారణ అంశాల ముసాయిదాలను ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకుంది. ఏపీ, తెలంగాణలు ప్రాదిపాదించిన విచారణ అంశాలపై సెప్టెంబరు 13 నుంచి వాదనలు వింటామని ట్రిబ్యునల్ పేర్కొంది. అయితే ఏపీ తరపున్యాయవాది ఎకే గంగూలి వాదనలు కొనసాగిస్తూ విభజన చట్టంలో షెడ్యూల్ -11లో పేర్కొన్న ప్రాజెక్టులకు సెక్షన్ -89తో సంబంధం లేదని వాదించారు. విభజన చట్టం తయారుచేసే సమయంలో దురదృష్టవశాత్తు తప్పులు దొర్లాయని ఆయన వివరించారు. తెలంగాణ తరపున సినియర్ న్యాయవాది వైథ్యనాథన్ వాదనలు కోనసాగిస్తూ.. మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులలో మిగులుల జలాలు ఉంటే ఏపీ ప్రకాశం బ్యారేజీ నుంచి వినియోగించుకోవాలి కానీ ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని వాడుకోవాలని ప్రయత్నిస్తోందని వాదించారు. దీంతో ట్రిబ్యునల్ జోక్యం చేసుకుని రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపుల సమయంలో మిగుల జలాలపై విభజన చట్టంలోని షెడ్యూల్11 ప్రకారం ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను పరిశీలించవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే మరోవైపు కృష్ణా జలాల యాజమాన్య బోర్డు 2015లో నీటి నిర్వహణకు సంబంధించిన రెండు రాష్ట్రాల మధ్య తాత్కాలిక నీటి కేటాయింపులను చట్టబద్ధం చేయాలన్న ఏపీ వాదనను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది.
అయితే జస్టిస్ బ్రిజేష్ కుమార్ జోక్యం చేసుకొని రెండు తెలుగు రాష్ట్రాలు సాగునీటి అవసరాలను తగ్గించుకునేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. తెలుగు రాష్ట్రాలు నీటి వాటా కోసం పరస్పర వాదనలు చేసుకుంటుండంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాగునీటి వినియోగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, దీని వల్ల రెండు రాష్ట్రాలకు అధిక నీరు అందే అవకాశం ఉందని ఆయన చెప్పారు.