జాతీయ వార్తలు

రాజ్యాంగమే సర్వోన్నతం: కోవింద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమియామ్ (మేఘాలయ), జూలై 7: దేశంలో ఎవరికైనా రాజ్యాంగమే సర్వోన్నతమైనదని రాష్టప్రతి ఎన్నికల్లో ఎన్‌డిఎ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ్‌నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. కుల, మత, ప్రాంతీయత ఆధారంగా ఎవరి పట్లా వివక్ష చూపబోనని ఆయన హామీ ఇచ్చారు. మేఘాలయలో శుక్రవారం ఆయన ఎన్‌డిఎ మిత్ర పక్షాల నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, పరిపాలనకు సంబంధించినంత వరకూ రాజ్యాంగమే అత్యున్నతమైనదని, కనుక రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కేవలం రాష్టప్రతిపైనే కాకుండా ప్రతి పౌరుడిపైనా ఉందిని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలు సహా దేశ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని, కుల, మత, ప్రాంతీయత, లింగ బేధం ఆధారంగా ఎవరి పట్ల వివక్ష చూపబోనని, యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు, దేశంలో ఆధునిక విద్య అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మొత్తం 60 మంది సభ్యులు గల మేఘాలయ శాసనసభలో ఎన్‌డిఎ మిత్రపక్షాలైన నేషనల్ పీపుల్స్ పార్టీకి ఇద్దరు, యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పరిమాణం, ప్రజాప్రతినిధుల సంఖ్యతో నిమిత్తం లేకుండా రాష్ట్రం, శాసనసభ ఎంతో ఉత్కృష్టమైనవని, రాష్ట్రం చిన్నదైనా లేక పెద్దదైనా అది దేశంలో అంతర్భాగమేనని, అందుకే ప్రతి రాష్ట్రాన్ని సందర్శిస్తున్నానని కోవింద్ తెలిపారు.