జాతీయ వార్తలు

మళ్లీ తెగబడిన పాక్ సైన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, జూలై 8: పాక్ సైన్యం మరోసారి సరిహద్దుల్లో కాల్పుల ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూ, కాశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో అధీన రేఖ వెంబడి ఉండే సైనిక శిబిరాలు, నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాక్ సైన్యం శనివారం జరిపిన కాల్పుల్లో ఒక ఆర్మీ జవాను, అతని భార్య మృతి చెందగా, వారి ముగ్గురు కుమార్తెలు గాయపడ్డారు. పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి శనివారం ఉదయం ఆరున్నరనుంచి అధీన రేఖ వెంబడి ఉండే సైనిక శిబిరాలు, నివాస ప్రాంతాలపై తేలికపాటి ఆయుధాలు, ఆటోమేటిక్ ఆయుధాలు, మోర్టార్లతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లు రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. భారత సైన్యాలు ఈ కాల్పులను సమర్థవంతంగా తిప్పి కొట్టాయని కూడా ఆ ప్రతినిధి తెలిపారు. పాక్ సైన్యం పేల్చిన మోర్టార్ గోళం కర్మారాలోని టెరిటోరియల్ ఆర్మీకి
చెందిన సిపాయి మహమ్మద్ షౌకత్ ఇంటికి సమీపంలో పేలిపోవడంతో అతదితో పాటుగా అతని నార్య సఫియా బీ మృతి చెందారని, వారి ముగ్గురు కుమార్తెలు జైదా కౌసర్(6), రబీనా కౌసర్(12), నజియా బీతో పాటుగా మరో వ్యక్తి గాయపడినట్లు ఆ ప్రతినిధి చెప్పారు. పౌర నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాక్సైన్యం మోర్టార్ బాంబు గోళాల వర్షం కురిపించిందని, భారీ ఎత్తున కాల్పులకు దిగిందని ఆ ప్రతినిధి చెప్పారు. ఖాది, కర్మారా, గుప్లుర్‌లాంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున మోర్టార్ దాడులు కొనసాగుతున్నట్లు, పాక్ సైన్యం ఎనిమిది వేర్వేరు పోస్ట్‌లనుంచి భారత సైనిక శిబిరాలు, నివాస ప్రాంతాలపై కాల్పులు జరుపుతున్నాయని ఆ అధికారి చెప్పారు. జూన్ నెలలో పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు సంబంధించిన 23 సంఘటనలు, ఒక బోర్డర్ యాక్షన్ టీమ్(బాట్) దాడి, రెండు చొరబాటు యత్నాలకు పాల్పడిందని, ఈ ఘటనల్లో ముగ్గురు జవాన్లు సహా మొత్తం నలుగురు చనిపోయారని ఆ ప్రతినిధి తెలిపారు.
పరస్పరం నిరసనలు
ఇదిలా ఉండగా సరిహద్దుల్లో కాల్పుల ఒప్పందం ఉల్లంఘనలపై భారత్, పాక్‌లు పరస్పరం అధికారికంగా నిరసనలు తెలిపాయి. శనివారం అధీన రేఖ వెంబడి నివాస ప్రాంతాలపై జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందిన గటనపై భారత విదేశాంగ శాఖ కార్యాలయం న్యూఢిల్లీలోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను పిలిచి అధికారికంగా నిరసన తెలిపింది. మరో వైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని అధీన రేఖ వెంబడి భారత సైన్యాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారని ఆరోపిస్తూ పాక్ ప్రభుత్వం శనివారం ఇస్లామాబాద్‌లోని భారత డిప్యూటీ హైకమిషనర్ జెపి సింగ్‌ను పిలిపించి నిరసన తెలియజేసిందని విదేశాంగ శాఖ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

చిత్రం.. మృతులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్న ఆర్మీ