జాతీయ వార్తలు

విడాకుల కేసుల్లో నలిగిపోతున్న బాల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: విదేశాల్లో ఉంటున్న తల్లిదండ్రుల విడాకుల కేసుల్లో వారి పిల్లలు తీవ్రవత్తిళ్లకు గురవుతున్నారని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్ పేర్కొన్నారు. భార్యాభర్తల్లో ఒకరు వేరే దేశంలో నివాసముంటే వారి మధ్య తలెత్తిన వివాదాలు విడాకుల వరకు వెళ్తే వారి పిల్లల సంరక్షణ ఎవరి బాధ్యతో నిర్ణయించడం చాలా క్లిష్టంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఇటువంటి కేసులకు సంబంధించి ఓ నిర్దిష్టమైన చట్టం తేవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కేసుల్లో ఆ కుటుంబ జీవన శైలి, సంస్కృతి సంప్రదాయాలపై ఆధారపడి పిల్లల బాధ్యత ఎవరికి అప్పజెప్పాలో నిర్ణయించాల్సి ఉంటుందని, అది అంత సులువు కాదని అన్నారు. శనివారం ఇంటర్నేషనల్ లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించిన ఓ సెమినార్‌ను జస్టిస్ ఖేహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విడాకుల కేసుల పరిధి సరిహద్దులు దాటితే పిల్లల సంరక్షణ పై తీర్పులు చెప్పడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. 1980లో హేగ్‌లో జరిగిన ఒప్పందం ప్రకారం అంతర్జాతీయంగా చిన్నపిల్లల హక్కుల సంరక్షణ అందరి బాధ్యతని చెప్పారు. ఈ ఒప్పందం ప్రకారం విదేశాల్లో హక్కులకు భంగం కలిగిన చిన్నారులను సురక్షితంగా స్వదేశానికి తేవాల్సిన బాధ్యత ఉంటుందని ఆయన అన్నారు. ఆవిధంగానే విదేశీ న్యాయవాదులను ఇక్కడి కోర్టుల్లో వాదించేందుకు అనుమతించే విషయంలో ఇక్కడి లాయర్లు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. మనదేశ న్యాయవాదులు అంతర్జాతీయంగా ఎవరికీ తీసిపోరని, బయటి వాళ్లు ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ మన అవకాశాలేమీ సన్నగిల్లవని పేర్కొన్నారు. మనవాళ్లు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి వాదించి గెలిచిరాగలరన్న విశ్వాసం ఉందని ఆయన పేర్కొన్నారు.