జాతీయ వార్తలు

నాలుగు రాష్రా టలకూ నీటిని పంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,మే 9: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టలో సెక్షన్ 89 ప్రకారం నాలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ నీటి పంపకాలు జరపాలని కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదనలు వినిపించింది. సోమవారం కృష్ణా నదీ జలాలల వివాదం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ తరపున సినియర్ న్యాయవాది ఏకె గంగూలీ ట్రిబ్యునల్ వాదనలు వినిపిస్తూ రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం అని మహారాష్ట్ర, కర్ణాటక వాదించడం సరి కాదన్నారు. చట్టంలో పేర్కొన్న అంశాలను మహారాష్ట్ర, కర్ణాటకలు అర్థం చేసుకోవాలన్నారు. ‘విభజన చట్టంలో ఎన్ని రాష్ట్రాల మధ్య కేటాయింపులు జరపాలన్నది చట్టంలో లేదు కాదా.. రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు జరిపితే తప్పు ఏమిటిని గంగూలీని బ్రిజేష్‌కుమార్ ప్రశ్నించారు. దీనికి గంగూలీ స్పదిస్తూ చట్టంలో కేవలం తెలుగు రాష్ట్రాలకే నీటి కేటాయింపులు జరపాలని ఎక్కడ లేదని ట్రిబ్యునల్‌కు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను గంగూలీ ట్రిబ్యునల్‌కు వివరించారు. విభజన చట్టంలో సెక్షన్ 89(ఏ) ప్రకారం ప్రాజెక్టు వారీగా కేటాయింపుల జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా సెక్షన్ (బీ) ప్రకారం తక్కువ నీటి ప్రవాహం ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీగా నీటి విడుదలకు ఆపరేషన్ ప్రొటోకాల్ ఏర్పాటు చేయాలని సూచించిందన్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు జరపాలని నాలుగు రాష్ట్రాలకు సంబంధం లేదని మహారాష్ట్ర, కర్ణాటకలు ట్రిబ్యునల్‌కు స్పష్టం చేశాయి. సీనియర్ న్యాయవాదులు మహారాష్ట్ర నుండి అంథ్యార్జునా, కర్ణాటక నుండి అనీల్ దివాన్, తెలంగాణ నుండి వైద్యనాథన్, అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు హాజరయ్యారు. మరో సారి మంగళవారం, బుధవారం ట్రిబ్యునల్ ముందు వాదనలు జరగనున్నాయి.