జాతీయ వార్తలు

సెతల్వాడ్‌కు సుప్రీంలో చుక్కెదురు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌కు సుప్రీం కోర్టులో ఊరట దక్కలేదు. 2002 గుజరాత్ అల్లర్లలో చనిపోయినవారి మృతదేహాలు ఖననం చేసిన ఘటనతో ఆమెకు సంబంధం ఉన్నట్టు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. పంచ్‌మహల్ పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. గుజరాత్ హైకోర్టు ఆదేశం మేరకు సెతల్వాడ్‌పై కేసు నమోదు చేయగా సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. తనపై కేసును కొట్టివేయాలని చేసుకున్న అభ్యర్థను సుప్రీం తోసిపుచ్చింది. పానం నదీ తీరంలో ఖననం చేసిన మృతదేహాలు అక్రమంగా వెలికి తీసినట్టు కేసు నమోదైంది. చార్జిషీట్ దాఖలైన కోర్టునే ఆశ్రయించాలని అరుణ్ మిశ్రా, అమిత్వారాయ్‌లతో కూడిన ధర్మాసనం సూచించింది.