జాతీయ వార్తలు

లాలూ కుమార్తెకు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: మనీలాండరింగ్ కేసులో ఆర్జేడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె, ఎంపీ మీసా భారతికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సోమవారం సమన్లు జారీ చేసింది. ఇటీవల ఈడి పలు సంస్థలపై నిర్వహించిన దాడుల్లో అనేక వాస్తవాలు వెలుగుచూశాయి. సుమారు 8వేల కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించి లాలూ కుమార్తె భారతిపై మనీలాండరింగ్ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి మంగళవారం విచారణకు హాజరుకావాలని ఈడి సమన్లలో పేర్కొంది.
ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లతో విచారణకు హాజరుకావాలని ఈడి ఆదేశించింది. మీసా భారతి భర్త శైలేష్‌కుమార్‌కు కూడా సమన్లు జారీచేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నెల 8న ఢిల్లీలో ఎంపీ భారతి ఆమె భర్త శైలేష్‌కు చెందిన మూడు సంస్థలపై సిబిఐ దాడులు నిర్వహించింది. డొల్ల కంపెనీలకు అక్రమ మార్గాల్లో నిధులు మళ్లించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. 8వేల కోట్ల రూపాయలకు సంబంధించి మనీలాండరింగ్ కింద కేసు నమోదయింది. సిబిఐ దాడుల జరిగిన మర్నాడే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఎంపీ మీసా భారతి ఫామ్‌హౌస్, శైలేష్ పేరుతో రిజిస్టరయిన మిశైల్ ప్రింటర్స్, ప్యాకర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లలో ఈడి తనిఖీలు నిర్వహించింది. ఇదే కేసులో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్తలైన సోదరులు సురేంద్ర కుమార్ జైన్, వీరేంద్ర జైన్‌లను ఈడి ఇంతకుముందే అరెస్టు చేసింది. సోదరుల్లో ఒకరు మిశైల్ ప్రింటర్స్‌తో సంబంధాలున్నట్టు తనిఖీల్లో వెల్లడైంది.