జాతీయ వార్తలు

బీహార్ సంకీర్ణంలో ముసలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూలై 10: బీహార్ సంకీర్ణంలో ముసలం పుట్టింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై సిబిఐ దాడులు చేయటం నితీశ్ కుమార్‌కి మద్దతు ఇవ్వటానికి బిజెపి సంసిద్ధం వ్యక్తం చేసింది.
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదివారం రాత్రి లాలూప్రసాద్‌కు ఫోన్ చేసి జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే తేజస్వి యాదవ్ ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయబోరని ఆ పార్టీ ఎమ్మెల్యే మండురికా ప్రసాద్ యాదవ్ తెలిపారు. మరోవైపు నితీశ్‌కుమార్ మంగళవారం పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. లాలూ కుటుంబంపై జరుగుతున్న సిబిఐ దాడులు, ప్రభుత్వం మనుగడపై వాటి పరిణామాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో నితీశ్‌కుమార్‌కు అండగా ఉంటామని బిజెపి నేత నిత్యానంద రాయ్ అన్నారు. అయితే ఇదంతా తమ పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. మూడు రోజులుగా లాలూ కుమారుడు తేజస్వి, కూతురు మీసా భారతికి చెందిన వివిధ సంస్థలు, ప్రాంగణాలపై సిబిఐ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. లాలూ కుటుంబంపై దాడులను కాంగ్రెస్ ఖండించినప్పటికీ, అధికార కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న జెడియు కానీ, నితీశ్ కానీ దీనిపై ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం విశేషం.
మంగళవారం తన పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేయటం ద్వారా ఢిల్లీలో జరగనున్న 17పార్టీల సమావేశానికి నితీశ్ డుమ్మా కొడుతున్నారు. రానున్న ఒకటి రెండు రోజుల్లో బీహార్ ప్రభుత్వంలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.