జాతీయ వార్తలు

ఉపరాష్టప్రతి పదవికీ పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: ఉపరాష్టప్రతి పదవికి కూడా పోటీ చేయాలని భావిస్తున్న ప్రతిపక్షం మంగళవారం తమ అభ్యర్థి పేరును ఖరారు చేయవచ్చు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన 18 ప్రతిపక్ష పార్టీల నాయకులు మంగళవారం సమావేశం అవుతున్నారు. బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ఉపరాష్టప్రతి పదవికిని అత్యంత సునాయసంగా గెలుచుకునేందుకు వీలున్నా అభ్యర్థిని రంగంలోకి దించటంద్వారా తమ సమైక్యతను కాపాడుకోవాలన్నది ప్రతిపక్షం వ్యూహం. అందుకే ఉపరాష్టప్రతి పదవికి కూడా పోటీ పెట్టాలని ప్రతిపక్షం ఆలోచిస్తోంది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కలిసి ఉపరాష్టప్రతిని ఎన్నుకుంటారనేది అందరికీ తెలిసిందే. లోక్‌సభకు ఎన్నికైన 543 సభ్యులు, ఇద్దరు నామినేటెడ్ సభ్యులు, రాజ్యసభకు ఎన్నికయిన 233 మంది సభ్యులతోపాటు రాష్టప్రతి నామినేట్ చేసిన 12 మంది సభ్యులు ఉపరాష్టప్రతి ఎన్నికలో ఓటర్లు. లోక్‌సభ, రాజ్యసభలను కలుపుకుంటే మొత్తం సభ్యుల సంఖ్య 790. ఇందులో ఎన్‌డిఏ, ఇతర భావసారూప్యత గల పార్టీలకు 550 మంది ఎంపీలున్నారు. ఈ లెక్కన బిజెపి ఉపరాష్టప్రతి పదవిని అత్యంత సునాయసంగా గెలుచుకుంటుంది. అయితే బిజెపి అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావటం ప్రతిపక్షానికి ఎంతమాత్రం ఇష్టం లేదు.
ఇదిలా ఉంటే రాష్టప్రతి ఎన్నిక మాదిరిగానే ఉపరాష్టప్రతి ఎన్నిక విషయంలోనూ ప్రతిపక్షంలో విభేదాలు పొడసూపాయి. బిహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) అధ్యక్షుడు నితీశ్ కుమార్ ప్రతిపక్ష పార్టీల సమావేశానికి హాజరుకావటం లేదు. బిజెపి రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ప్రకటించిన నితీశ్ కుమార్, ఉపరాష్టప్రతి ఎన్నికలో కూడా అధికార పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వనున్నారు. అందుకే ఆయన మంగళవారం పార్లమెంటు ఆవరణలోని గ్రంథాలయంలో సోనియా గాంధీ అధ్యక్షతన జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశానికి హాజరుకావటం లేదు. నితీశ్ కుమార్ బిహార్ రాజధాని పాట్నాలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నితీశ్, ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నించారు. ఈ సమస్య గురించి చర్చించేందుకు ఢిల్లీకి రావాలని నితీశ్ కుమార్‌కు రాహుల్ గాంధీ ఆహ్వానం పంపించారు. అయితే నితీశ్ కుమార్ మాత్రం ఈ విషయంలో రాహుల్ గాంధీ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించటం లేదు. ఉపరాష్టప్రతి పదవికి ప్రతిపక్షం తరపున ఎవరిని రంగంలోకి దించాలనేది ఇంకా నిర్ణయించలేదు. కాంగ్రెస్ లేదా ఏ ఇతర ప్రతిపక్షం కూడా ఉపరాష్టప్రతి పదవికి పేర్లు ప్రతిపాదించలేదని సిసిపి కార్యదర్శి డి రాజా చెప్పారు.
ప్రతిపక్షం తరపున ఉపరాష్టప్రతి పదవికి పోటీచేసే అభ్యర్థుల గురించి మంగళవారం నాడు జరిగే సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని రాజా చెప్పారు. ప్రతిపక్షంతోపాటు అధికార పక్షం ఓట్లు సంపాదించగలిగే నాయకుడిని రంగంలోకి దించాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచిస్తోంది.