జాతీయ వార్తలు

మలబార్ తీరంలో విన్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 10: భారత్, యుఎస్, జపాన్ దేశాల మధ్య నౌకాదళ సంబంధాలు మరింత పటిష్ఠపరుచుకునేందుకు దోహపడేవిధంగా బంగాళాఖాతం, నార్త్ ఇండియన్ సీలో మలబార్ విన్యాసాలు సోమవారం ప్రారంభమయ్యాయి. విన్యాసాలు 17వ తేదీ వరకూ జరగనున్నాయి. సముద్ర భద్రత విషయంలో ఈ మూడు దేశాలు సంయుక్తంగా చేపట్టాల్సిన చర్యలు, వాటికి సంబంధించి ఆయా దేశాల్లో ఉన్న శక్తి సామర్థ్యాల గురించి ఇందులో పరస్పరం తెలుసుకుంటారు. మలబార్ విన్యాసాల్లో మొట్టమొదట ఈ మూడు దేశాల నౌకాదళ సిబ్బంది వృత్తి నైపుణ్యతపై చెన్నై హార్బర్‌లో ఈ నెల 10 నుంచి 13 వరకూ పరస్పరం సంభాషించుకుంటారు. ఈ విన్యాసాల్లో ప్రధానంగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియ్ ఆపరేషన్స్, ఎయిర్ డిఫెన్స్, యాంటి సబ్‌మెరైన్ వార్‌ఫేర్, సర్ఫేస్ వార్‌ఫేర్, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, యుద్ధ నైపుణ్యత, అందులోని వ్యూహాలను ఈ చర్చల్లోకి రానున్నాయి. భారత్, యుఎస్, జపాన్ దేశాలకు చెందిన యుద్ధ నౌకలు 15న విన్యాసాలకు బయల్దేరి వెళతాయి. భారత నౌకదాళం నుంచి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ రణవీర్, ఫ్రిగేడ్స్ శివాలిక్, సహ్యాద్రి,తోపాటు అమెరికా, జపాన్ నుంచి వచ్చి యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి.

చిత్రం.. అమెరికా, జపాన్‌కు చెంది నావీ కమాండర్లతో ఈస్టరన్ నావల్ కమాండ్ హెచ్.సి.ఎస్.బిస్త్