జాతీయ వార్తలు

నగదు బదిలీతో 57వేల కోట్ల ఆదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: వివిధ పథకాలకు ఇచ్చే సబ్సిడీలను నగదు బదిలీ పథకం కింద నేరుగా వినియోగదారుల ఖాతాలకు వేయటం ద్వారా కేంద్రానికి దాదాపు రూ.57వేల కోట్ల రూపాయల మేర ఆదా అయిందని కేంద్ర ప్రభుత్వ డాటాలో వెల్లడైంది. 2013 జనవరి 1న అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ సాంఘిక సంక్షేమ పథకాల ప్రయోజనాలకు లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమచేయటం ద్వారా బోగస్ చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ స్కీం వల్ల 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.57,029కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయ్యాయి. ముఖ్యంగా వంట గ్యాస్‌పై ఇస్తున్న సబ్సిడీ వల్ల రూ.29,769కోట్లు ఆదా అయ్యాయి. ప్రజాపంపిణీ వ్యవస్థలో రూ.14వేల కోట్లు ఖజానాకు మిగిలాయి. నిన్న యుపి ఏ, నేడు ఎన్డీ ఏ ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నరేగా(మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం) కింద గ్రామీణ ప్రజలకు కచ్చితంగా వంద రోజుల పని కల్పించే ఈ స్కీం ద్వారా రూ.11,741కోట్లు, జాతీయ సామాజిక సహాయ పథకం కింద రూ.399 కోట్లు ఆదా అయినట్లు ఈ డాటా వెల్లడించింది. కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్‌లో ఈ డాటా అందుబాటులోకి వచ్చింది. 2015-16లో రూ.36,144కోట్లు ఆదా అయ్యాయి. 2017మార్చి నాటికి 140 పథకాలు ప్రత్యక్ష నగదు బదిలీ పథకం పరిధిలో ఉన్నాయి. అయితే మొత్తం 60 ప్రభుత్వ విభాగాల్లో 485 పథకాలు ప్రత్యక్ష నగదు బదిలీ పథకం పరిధిలోకి తీసుకురావచ్చని ప్రభుత్వం గుర్తించింది. లబ్ధిదారుల సంఖ్య కూడా 10.71కోట్ల నుంచి 35.62కోట్లకు పెరిగింది. 2-17-18 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నగదు బదిలీకి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది.