జాతీయ వార్తలు

లష్కర్ ఉగ్రవాది అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూలై 10: జమ్ము కాశ్మీర్ పోలీసులు సోమవారం లష్కర్ ఏ తోయిబాకు చెందిన అత్యంత కీలకమైన ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. ఇతనితో పాటు ఉత్తరప్రదేశ్ వాసితోసహా ఇద్దరిని అరెస్ట్ చేశారు. ‘వివిధ సంచలనాలు సృష్టించిన ఉగ్రవాద నేరాల్లో కీలకపాత్ర పోషించిన ముష్కరుడిని అరెస్ట్ చేశాం. దక్షిణ కాశ్మీర్‌లో పలు నేరాలకు ఇతడు పాల్పడ్డాడు. ఇతనితోపాటు సందీప్ కుమార్ శర్మ అలియాస్ ఆదిల్ (ముజఫర్‌నగర్, యూపి), కుల్గాం ప్రాంతానికి చెందిన మునీబ్‌షాలను కూడా అదుపులోకి తీసుకున్నాం’ అని ఇన్‌స్పెక్టర్ జనరల్ మునీర్ ఖాన్ విలేఖరులకు తెలిపారు. ఇటీవలి కాలంలో సందీప్‌ని లష్కర్ తన కార్యకలాపాలకు ఎక్కువగా వాడుకుందని ఆయన తెలిపారు. అంతే కాకుండా పలు ప్రదేశాల్లో బ్యాంకులు, ఏటిఎంలను కూడా వీరు లూటీ చేశారని వివరించారు. దక్షిణ కాశ్మీర్‌లో ఆరుగురు పోలీసులను చంపిన ఉగ్రఘటనలో వీరు పాత్రధారులని ఆయన అన్నారు. లష్కర్ కమాండర్ బషీర్ లష్కరీ చనిపోయిన ఇంట్లోనే సందీప్ పట్టుబడ్డాడని ఆయన వివరించారు. స్థానికేతరుడిని అక్కడ చూసి తాము ఆశ్చర్యపోయామని తరువాత అతణ్ణి లోతుగా విచారించామన్నారు. ఇతను కాశ్మీర్ లోయలోనే కాకుండా పంజాబ్‌లోని పాటియాలాకు కూడా వెళ్లి అక్కడ కార్యకలాపాలు చేసేందుకు రెక్కీ నిర్వహించాడన్నారు. సందీప్‌తోపాటు మునీబ్‌షా, షాహిద్ అహ్మద్, ముజఫర్ అహ్మద్‌లు కుల్గాంలో ఒక ఇంట్లో అద్దెకుంటున్నారని వివరించారు. వీరు కరడుగట్టిన లష్కర్ ఉగ్రవాది షకూర్ అహ్మద్‌ను కలుసుకున్నారని అతని ఆదేశాల మేరకు పోలీస్ పార్టీపై, ఆర్మీ కాన్వాయ్‌పై దాడులు చేశారని పేర్కొన్నారు. ఇలావుండగా నౌగాం సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకురావటానికి ప్రయత్నించిన ముగ్గురు మిలిటెంట్లను భద్రతాదళాలు మట్టుబెట్టాయి.

చిత్రం.. పట్టుబడిన ఉగ్రవాదులను విలేఖరులకు చూపుతున్న కాశ్మీర్ పోలీసులు