జాతీయ వార్తలు

పూరీ ఎక్స్‌ప్రెస్ బోగీలో గ్యాస్ లీక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, జూలై 10: తిరుపతి నుంచి పూరికి వెళ్లే పూరి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో గ్యాస్ సిలిండర్లలో గ్యాస్ లీకవ్వడంతో అత్యవసర చైన్‌లాగి రైలును ఆపి ప్రయాణికులు పరుగులు తీసిన సంఘటన సోమవారం ఉదయం రేణిగుంట రైల్వేస్టేషన్‌లో రెండోనెంబర్ ప్లాట్‌ఫాం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే తిరుపతి నుంచి పూరికి బయలుదేరిన పూరి ఎక్స్‌ప్రెస్ రైలు రేణిగుంట రైల్వేస్టేషన్‌నుంచి బయల్దేరింది. నార్త్ క్యాబిన్ వద్దకు రాగానే జనరల్ బోగీలో ఒక్కసారిగా రెండు సిలిండర్లనుంచి గ్యాస్ లీకవ్వడంతో ప్రయాణికులు చైన్‌లాగి రైలు ఆపి ప్రయాణికులు పరుగులు తీస్తుండటంతో పక్క బోగీలలో ఉన్న ప్రయాణికులు కూడా గందరగోళానికి గురై రైలు నుంచి కిందకుదిగి దూరంగా పరిగుతీశారు. విషయం తెలుసుకున్న ఆర్‌పిఎఫ్, సి ఆర్‌పి ఎఫ్ పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చేసరికి లీక్ అవుతున్న గ్యాస్ సిలిండర్‌ను ప్రయాణికులు ధైర్యంచేసి రైలునుంచి బయటకు విసిరేశారు. అప్పటికే వచ్చిన ఆర్ పి ఎఫ్, జి ఆర్ పి ఎఫ్ పోలీసులు కొంతసేపు ఆగిన రైలు వద్ద హడావుడిచేసి నలుగురు వలస కూలీలను అదుపులోకి తీసుకుని ఆర్‌పిఎఫ్ పోలీసుస్టేషన్‌కు తరలించి వీరిని విచారించారు. ఒంగోలుకు చెందిన నలుగురు కూలీలు చిత్తూరులో కాంట్రాక్ట్ కూలి పనులు ముగియడంతో సిలిండర్లు ప్లాస్టిక్‌గోతాంలో మూటకట్టి మిగిలిన సామాన్లతో కలిపి ఒంగోలుకు వెళ్తున్నారని పోలీసుల విచారణలో తేలింది.