జాతీయ వార్తలు

మంచీ..మర్యాద తెలుసా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: పాకిస్తాన్ కస్టడీలో ఉన్న కుల్‌భూషణ్ జాధవ్ తల్లికి మెడికల్ వీసా మంజూరు చేయకపోవడంపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ నావీ ఉద్యోగి జాధవ్ పాక్ ప్రభుత్వం కస్టడీలో ఉన్నారు. కుమారుడిని కలవాలని అతడి తల్లి అవంతిక జాధవ్ వీసాకోసం దరఖాస్తు చేసుకున్నారు. మానవతా దృక్పథంతో పరిశీలించి వీసా మంజూరు చేయాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్వయంగా పాకిస్తాన్‌కు లేఖ రాశారు. అవంతికకు వీసా మంజూరు చేయాలని పాక్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్‌ను కోరినా అతీగతీలేకుండాపోయింది. దీనిపై సుష్మా తీవ్రంగా మండిపడుతూ ట్వీట్ చేశారు. ‘్భరత్‌లో వైద్య చికిత్సల నిమిత్తం ఎందరో పాకిస్తానీయులకు మేం వీసాలు ఇస్తున్నాం. దరఖాస్తు చేసుకోగానే వీసా ఇచ్చేలా ఎన్నోసార్లు ఆదేశాలు ఇచ్చాం. పాక్ ప్రజల పట్ల భారత్ ఎంతో సానుభూతితో వ్యవహరిస్తోంది. అయితే మీకు అలాంటి ఉదారత ఉండడం లేదు. కుల్‌భూషణ్ తల్లి వీసా దరఖాస్తు పెండింగ్‌లో పెట్టారు’ అని సుష్మా తన ట్వీట్‌లో విరుచుకుపడ్డారు. తన లేఖ చూసైనా అజీజ్ కనీస మర్యాద పాటించకపోవడం దుర్మార్గం అని విదేశాంగ మంత్రి దుయ్యబట్టారు. గత ఏడాది జలూచీస్తాన్‌లో జాధవ్‌ను అరెస్టు చేశారు. పాక్ మిలటరీ కోర్టు అతడికి మరణశిక్ష విధించింది.
చర్చలతోనే సమస్యలకు పరిష్కారం
ఇస్లామాబాద్: కాశ్మీర్‌సహా అన్ని సమస్యలు చర్చలద్వారానే పరిష్కరించుకోవాలని తాము భావిస్తున్నట్టు పాక్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ అన్నారు. నియంత్రణ రేఖ వద్ద భారత్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించిన ఆయన సరిహద్దులో అశాంతికి భారత్ వైఖరే కారణమన్నారు. కాశ్మీర్‌తోపాటు అన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.

చిత్రం.. సుష్మా స్వరాజ్