జాతీయ వార్తలు

పిల్లలకూ పరిహారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 25: పోలవరం ప్రాజక్టులో ముంపునకు గురవుతున్న గ్రామాలలోని పిల్లలకు కూడా నష్టపరిహారం చెల్లించే విషయాన్ని పరిశీలించేందుకు కేంద్ర జలవనరుల శాఖ అధికారుల బృందాన్ని పంపించడానికి చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, భూవనరుల శాఖ కార్యదర్శి విజయ్ ఎస్.మదన్ తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డికి రాసిన సమాధాన లేఖలో ఈ విషయం వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న గ్రామాలలోని పిల్లలకు కూడా నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ గోవర్దన్ రెడ్డి రాసిన లేఖకు విజయ్ ఎస్ మదన్ బదులిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పరిపాలన, నిర్వహణ తదితర అంశాలు కేంద్ర జలవనరుల శాఖ పరిధిలో ఉన్నందున మీరు రాసిన లేఖను ఆ శాఖ కార్యదర్శికి పంపిస్తున్నట్లు మదన్ గోవర్దన్ రెడ్డికి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి పిల్లలకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు ఒక కమిటీని పంపించేందుకు జల వనరుల శాఖ తగు చర్యలు తీసుకుంటుందని ఆయన గోవర్దన్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.