జాతీయ వార్తలు

జైళ్ల అధికారుల మధ్య ‘శశికళ’చిచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 13: అక్రమ ఆస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారన్న వార్తలు జైలు అధికారుల మధ్యే చిచ్చురేపింది. దీంతో చిన్నమ్మను మరో జైలుకు తరలిచాలని కర్నాటక ప్రభుత్వం యోచిస్తోంది. జైలులో శశికళకు ప్రత్యేకంగా వంటగది ఏర్పాటు చేశారన్న వార్త కలకలం రేపింది. రెండు కోట్ల రూపాయలు తీసుకుని చిన్నమ్మకు సకల ఏర్పాట్లు చేశారని జైళ్లశాఖ డిఐజి డి.రూప డిజిపి (జైళ్లు) హెచ్‌ఎస్ సత్యనారాయణకు ఆరు పేజీల లేఖ రాశారు. సత్యనారాయణకు సొమ్ములు ముట్టాయని ప్రభుత్వానికి రూప నివేదించారని తెలిసింది. దీంతో వీరి మధ్య చిచ్చురగిలింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను జైళ్లశాఖ డిఐజి కొట్టిపారేశారు. పరప్పన జైలులో జరుగుతున్న వ్యవహారంపై డిజిపికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రూప తన నివేదికలో స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య వరకూ వెళ్లడంతో శశికళను మరోచోటికి తరలించాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. మరోపక్క జైళ్లశాఖ ఉన్నతాధికారుల మధ్య చిచ్చు రగులుతోంది. డిఐజి రూపపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని సత్యనారాయణ రావు హెచ్చరించారు. జైలులో ఎవరికీ ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు నుంచి వచ్చిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను సాధారణ పౌరులుగానే పరిగణించామని ఆయన తెలిపారు. అక్రమార్జన కేసులో శశికళ, సుధాకరన్, ఇలవరసీలకు నాలుగేళ్ల జైలుశిక్ష పడింది. ఫిబ్రవరిలో వారిని బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలుకు తరలించారు.