జాతీయ వార్తలు

ఎన్డీఏను నిలదీసేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార ఎన్డీఏ సర్కారుపై విమర్శల కత్తులు దూసేందుకు 18 ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీ తదితర నిర్ణయాలను దుయ్యబట్టడంతోపాటు సర్కారు తీరునుకూడా ఎండగట్టేందుకు ఉమ్మడి వ్యూహ ప్రాతిపదికగా ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రతిపక్షాల మధ్య విస్తృతస్థాయి చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. 17నుంచి మొదలయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఇతర అంశాలను కూడా చేపట్టాలని ప్రభుత్వాన్ని నిలదీయాలన్నదే విపక్షాల ఉమ్మడి వ్యూహంగా కన్పిస్తోంది. ఇందుకు సంబంధించి ఇటీవల జరిగిన సమావేశంలో ఈ 18 పార్టీల నేతలు విస్తృతంగా చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఉపరాష్టప్రతి పదవికి ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించే అంశంపైనే మంగళవారం నాడు ఈ పార్టీలు సమావేశమయినప్పటికీ, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఏవిధంగా నిలదీయాలన్నదానిపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ 18 పార్టీల మధ్య మొత్తం అయిదు కీలకాంశాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లుగా చెప్తున్నారు. పార్లమెంట్ లోపలా, బయటా, సామాజిక మీడియాలోనూ సర్కార్‌ను ఏవిధంగా నిలదీయాలన్నదానిపై ఈ పార్టీలు కూలంకషంగా చర్చించినట్లు ఈ వర్గాల సమాచారం. పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన ప్రతికూల పరిణామాలను ఎండగట్టడంతోపాటు, హడావుడిగా జిఎస్టీని అమలు చేయటంవల్ల ఎలాంటి కష్టనష్టాలు తలెత్తబోతున్నాయన్న దానిపై కూడా ప్రజలకు వివరించాలని ఈ పార్టీలు నిర్ణయించాయి. వీటితోపాటు రైతుల ఆత్మహత్యలు, రాజకీయ వేధింపుల అంశాన్ని కూడా గట్టిగా ప్రస్తావించాలని నిర్ణయించాయి. దేశ సమాఖ్య వ్యవస్థను పరిరక్షించాలన్న బలమైన వాదనతో ముందుకు వెళ్లాలని ఈ పార్టీలు సంకల్పించాయి. ప్రజల మధ్య మతపరమైన చిచ్చును పెట్టే రీతిలో సాగుతున్న ఫేక్ న్యూస్‌ను కూడా ఎండగట్టాలని సంకల్పించాయి. మొత్తం మీద పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అధికార విపక్షాల మధ్య పదునైన వాదోపవాదాలకు తెరలేపే అవకాశం స్పష్టంగా కన్పిస్తోంది.