జాతీయ వార్తలు

చెత్తవేస్తే 50వేలు కట్టాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: రోజురోజుకీ కలుషితమైపోతున్న గంగానదిని సంరక్షించేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) గురువారంనాడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. నదిలోపల 500 మీటర్ల పరిధిలో ఎటువంటి చెత్తగాని, పారిశ్రామిక వ్యర్థాలు కాని వేయడానికి వీలులేనని, అలావేస్తే రూ.50వేల పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఎన్‌జిటి ఉన్నతాధికారి జస్టిస్ స్వతంత్ర కుమార్ ఆదేశాలు జారీచేశారు. అలాగే గంగానదికి వెలువల 100 మీటర్ల పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టరాదని పేర్కొన్నారు. గంగానదీ పరీవాహకంలో హరిద్వార్ నుంచి ఉన్నావో తీరంవరకు ఉన్న తోళ్ల పరిశ్రమలను ఆరు వారాల్లోగా తరలించారని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేశారు. గంగా ఘాట్‌ల నిర్వహణపై కూడా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు కొన్ని నియమ నిబంధనలను సూచించారు. తీవ్రంగా కలుషితమైపోతున్న నదుల్లో గంగానది ఒకటి అనే విషయం తెలిసిందే.