జాతీయ వార్తలు

కులాల కోరల్లోంచి బయటపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయపూర్, జూలై 13: దేశ అత్యున్నత పదవికి జరిగే ఎన్నికలను ఇద్దరు దళితుల మధ్య పోటీగా అభివర్ణించడాన్ని ప్రతిపక్షాల రాష్టప్రతి అభ్యర్థి మీరా కుమార్ తీవ్రంగా ఖండించారు. ఇది సమాజం నిజరూపాన్ని బయటపెట్టిందని అన్నారు. సమాజం ఇప్పటికీ ప్రతి విషయాన్ని కులం అనే చట్రంలోంచే చూస్తోందని అన్నారు. ఈ నెల 17న జరగనున్న రాష్టప్రతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరడానికి గురువారం చత్తీస్‌గఢ్ వచ్చిన మీరాకుమార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. మొట్టమొదటిసారి రాష్టప్రతి ఎన్నికలు సిద్ధాంతాల ప్రాతిపదికపై జరుగుతున్నాయని ఆమె అన్నారు. ఇద్దరు దళితుల మధ్య పోటీగా అభివర్ణించడం గురించి ఒక విలేఖరి ప్రశ్నించగా, ఇది ఒక విధంగా సంతోషం, మరోవైపు బాధ కలిగిస్తున్నాయన్నారు. ఇది సమాజపు నిజస్వరూపాన్ని బయటపెట్టిందని, ఇలాంటి ఆలోచనా ధోరణి ఇప్పటికీ కొనసాగుతూ ఉండడం, వాటిపై ఇంకా చర్చ జరుగుతూ ఉన్నందుకు తనకు బాధగా ఉందన్నారు. ఇలాంటి ధోరణితో మనం ఎలా పురోగతి సాధిస్తామని ఆమె ప్రశ్నించారు. కుల వ్యవస్థ కోరలనుంచి బయటపడకపోతే మనం ఎప్పటికీ పురోగమించలేమని అన్నారు. గతంలోనూ ఎన్నోసార్లు రాష్టప్రతి ఎన్నికలు జరిగాయని, అగ్రకులాలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు పోటీ పడినప్పుడు వారి సామర్థ్యం, గుణగణాల గురించే చర్చించేవారని, వారి కుల ప్రస్తావన ఎప్పుడూ రాలేదని అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఇద్దరూ దళితులన్న అంశం తప్ప మరో విషయం చర్చకు రావడం లేదని అన్నారు. దళితులు, గిరిజనులపై దాడులు పెరిగిపోయాయని, వారి గొంతును వినిపించడం కోసమే తాను పోటీ చేస్తున్నానని చెప్పారు. మన పూర్వీకులనుంచి వారసత్వంగా సంక్రమించిన సిద్ధాంతాలు, విలువల ఆధారంగా కలిసికట్టుగా పోరాడాలని మొట్టమొదటిసారిగా 17 ప్రతిపక్షాలు నిర్ణయించాయని, ఇది నిజంగా భారత రాజకీయాల్లో ఒక ముఖ్య ఘట్టమని చెప్పారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని తాను ఎమ్మెల్యేలు, ఎంపీలను కోరినట్లు తెలిపారు.

చిత్రం.. డెహ్రాడూన్‌లో గురువారం విలేఖరులతో మాట్లాడుతున్న మీరాకుమార్