జాతీయ వార్తలు

పదునుగా మీడియా ముందుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చైనా రాయబారి లువో జావోహుయ్‌తో జరిగిన చర్చల వివరాలను పత్రికలకు చెప్పే విషయంలో పార్టీ మీడియా విభాగం వ్యవహరించిన తీరుపట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆగ్రహంతో ఉన్నారు. మీడియా విభాగం కోరలు కత్తిరించేందుకు గత రాత్రి సీనియర్ నాయకులతో కమ్యూనికేషన్ స్ట్రాటజీ గ్రూపును ఏర్పాటు చేసినట్లు తెలిసింది. రాహుల్ గాంధీ చైనా రాయబారిని కలవలేదని మొదట చెప్పిన మీడియా విభాగం, ఆ తరువాత మాటమార్చి రాయబారిని కలుసుకున్నట్లు చెప్పటం తెలిసిందే. ఈ సంఘటన మూలంగా రాహుల్ గాంధీ ప్రతిష్ట బాగా దెబ్బతిన్నదని సోనియా గాంధీ భావిస్తున్నారు. అందుకే ఆమె లోక్‌సభలో కాంగ్రెస్‌పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, ఉపనాయకుడు ఆనంద్ శర్మ, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు పి.చిదంబరం, మణిశంకర్ అయ్యర్, జైరాం రమేష్, సిపిపి సీనియర్ నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా, ఎంపీ సుష్మితాదేవ్, రణదీప్‌సింగ్ సుర్జేవాలా, పరిశోధనా విభాగం అధ్యక్షుడు రాజీవ్ గౌడతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ క్రమం తప్పకుండా సమావేశమై తాజా పరిస్థితులు సమీక్షించిన అనంతరం పత్రికలకు ఏం చెప్పాలనేది మీడియా విభాగానికి సూచిస్తుంది. కమ్యూనికేషన్ స్ట్రాటజీ గ్రూపు చేసే సూచనలు, ఇచ్చే సలహాల ఆధారంగానే పార్టీ మీడియా విభాగం పత్రికా విలేఖరులతో మాట్లాడవలసి ఉంటుంది. రాహుల్ గాంధీ చైనా రాయబారిని కలిసి సిక్కిం సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి చర్చించారు. ఈ విషయం బైటికిరాగానే పత్రికా విలేఖరులు కాంగ్రెస్ మీడియా విభాగాన్ని వివరణ అడిగారు. దీనికి రణదీప్‌సింగ్ సుర్జేవాలా స్పందిస్తూ రాహుల్ గాంధీ చైనా రాయబారిని కలిసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పారు. అయితే ఆ తరువాత రెండు గంటలకే మనీష్ తివారీ మాట్లాడుతూ పార్టీ ఉపాధ్యక్షుడు చైనా రాయబారిని కలుసుకున్నారని చెబుతూ, దీనిని రాజకీయం చేయటం మంచిది కాదని సూచించారు. దీనితో రాహుల్ గాంధీ చైనా రాయబారిని కలుసుకోవటం అత్యంత వివాదాస్పద అంశంగా మారింది. భారత, చైనా సైనికుల మధ్య ఉద్రిక్తత నెలకొన్న సమయంలో రాహుల్ గాంధీ చైనా రాయబారిని ఎందుకు కలుసుకున్నారంటూ బిజెపి ప్రశ్నించింది. ఈ వ్యవహారమంతా రాహుల్ ప్రతిష్టను దిగజార్చిందని భావించిన సోనియా కాంగ్రెస్ మీడియా విభాగం అధికారాలను కత్తిరించటంతోపాటు దానిపై సీనియర్ నాయకులతో కూడిన పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు.