జాతీయ వార్తలు

త్వరగా పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: కృష్ణా నదీ జలాల కేటాయింపులపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణను త్వరితగతిన పూర్తి చేసి తీర్పును వెలువరించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ దీనికి సంబంధించిన పిటిషన్ల విచారణ తరచూ వాయిదాలు పడుతోందని, మూడేండ్లుగా పెండింగ్‌లోనే ఉందని, ఈ కేసుకు త్వరగా పరిష్కారం చూపాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖెహార్‌కి విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ ప్రస్తుతం కావేరీ నదీ జలాల వివాదం విచారణ జరుగుతుందని, అది త్వరలోనే పూర్తికానుందని, అనంతరం కృష్ణా నదీ జలాల పిటిషన్లపై విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. అయితే ఈ పిటిషన్లు ఆగస్టు చివరి వారంలో విచారణకు వచ్చే అవకాశం ఉంది.