జాతీయ వార్తలు

ఉలిక్కిపడిన యూపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూలై 14: ఉత్తరప్రదేశ్ పోలీసుల భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపే విధంగా ఏకంగా అసెంబ్లీ భవనంలోపలే పేలుడు పదార్థాలు కనిపించడం సంచలనం సృష్టించింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో అందరూ ఉలిక్కి పడ్డారు. మరో వైపు ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున యుపి అసెంబ్లీ భవనాన్ని పేల్చేస్తానంటూ బెదిరిస్తూ పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసిన ఓ యువకుడిని రాష్ట్ర పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
ఈ నెల 12న అసెంబ్లీ భవనాన్ని భద్రతా సిబ్బంది రొటీన్‌గా తనిఖీ చేస్తున్న సమయంలో ఓ ప్రతిపక్ష సభ్యుడి సీటు కింద ఓ ప్యాకెట్ కనిపించింది. ఆ బృందం దాదాపు అరవై గ్రాముల బరువుండే ఆ ప్యాకెట్‌ను మార్షల్‌కు అప్పగించిన తర్వాత వెళ్లిపోయింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు సోదాలు జరపడం రొటీన్‌గా జరిగే ప్రక్రియేనని, ఏదయినా లోపం కనిపిస్తే విధాన సభలో ఉండే భద్రతా సిబ్మందికి తెలియజేస్తూ ఉంటారని లక్నో ఎస్‌ఎస్‌పి దీపక్ కుమార్ తెలిపారు. అసెంబ్లీ భవనంలో అనుమానాస్పదంగా ఉండే ప్యాకెట్ దొరికిన విషయాన్ని మార్షల్స్ ఉన్నతాధికారులకు చేరవేయడంతో వారు దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. కాగా, ప్యాకెట్‌లో ఉన్నది అత్యంత శక్తివంతమైన పెంటారిధ్రిటాల్ టెట్రానైట్రేట్(పిటిఇఎన్) అనే ప్లాస్టిక్ పేలుడు పదార్థమని ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు పోలీసులకు గురువారం తెలియజేశారు. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ ఇంకా తన తుది నివేదికను సమర్పించలేదని,ప్రాథమిక పరీక్షల ఆధారంగానే
ఈ విషయాన్ని కనుగొన్నారని దీపక్ కుమార్ చెప్పారు. అయితే ఈ పేలుడు పదార్థాన్ని ఐఇడి లేదా డెటొనేటర్‌లో వాడి మాత్రమే పేల్చవచ్చని, విడిగా వాడడానికి వీలు లేదని కూడా ఆయన చెప్పారు.
మొబైన్ ఫోన్లు తేవద్దు
ఈ సంఘటన వెలుగులోకి రావడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ శుక్రవారం ఉదయం అసెంబ్లీ సమావేశం ప్రారంభం కావడానికి ముందు భద్రతా వైఫల్యంపై చర్చించడానికి ఉన్నతాధికారులతో సమావేశమైనారు. ఇది కచ్చితంగా దుశ్చర్యేనని, ఇలాంటి వ్యక్తులను వదిలిపెట్టకూడదని అనంతరం అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అన్నారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై జాతీయ భద్రతా ఏజన్సీ (ఎన్‌ఐఏ)చేత దర్యాప్తు జరపాలన్న ఆయన పిలుపునకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కాగా, దేశంలోనే అతి పెద్ద అసెంబ్లీ అయిన యుపి అసెంబ్లీలో తీసుకోవలసిన పలు భద్రతా చర్యలను కూడా ఈ సందర్భంగా ఆయన సూచించారు. వీటిలో ప్రధానమైనది సభ్యులు అసెంబ్లీలోకి మొబైల్ ఫోన్లను తీసుకు రావడాన్ని నిషేధించడం. సమావేశాలు జరుగుతున్నప్పుడు సభ్యులు అసెంబ్లీలోకి మొబైల్ ఫోన్లు తీసుకు రావద్దు. ఒక వేళ తీసుకువచ్చినా వాటిని సైలంట్ మోడ్‌లో పెట్టాలి. సభ్యుల బ్యాగ్‌లు, మొబైల్ ఫోన్లు పెట్టడానికి సభ వెలుపల ఏర్పాట్లు ఉండాలని ఆయన అన్నారు. అలాగే ప్రతి గేటు వద్ద క్విక్ రియాక్షన్ టీమ్‌లను నియమించాలని, పాస్ లేకుండా సభలోకి ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు.
అసెంబ్లీని పేల్చేస్తానన్న వ్యక్తి అరెస్టు
ఇదిలా ఉండగా, ఆగస్టు 15న యుపి అసెంబ్లీ భవనాన్ని పేల్చేస్తానంటూ పోలీసు అధికారులకు ఫోన్ చేసి బెదిరించిన ఫర్హాన్ అహ్మద్ అనే 20 ఏళ్ల యువకుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తప్పుడు చిరునామా సమర్పించి అతను ఫోన్ సిమ్ తీసుకున్నాడని ఎఎస్‌పి చిరంజీవి సిన్హా చెప్పారు. దేవోరియా జిల్లాకు చెందిన అతడ్ని తార్కుల్‌వాన్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ వంతెన వద్ద అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. ఫర్హాన్ తన మొబైల్‌ఫోన్‌నుంచి శాంతిభద్రతల విభాగం అదనపు డిజికి ఫోన్ చేసి స్వాతంత్య్ర దినోత్సవం రోజున యుపి అసెంబ్లీ భవనాన్ని పేల్చేస్తానని బెదిరించినట్లు ఆయన చెప్పారు.