జాతీయ వార్తలు

ఇలాంటి అధికారులే కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుదుచ్చేరి, జూలై 14: అక్రమ ఆస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో ఉన్న అన్నాడిఎంకె నాయకురాలు శశికళకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్న విషయాన్ని బయటపెట్టిన జైళ్లశాఖ డిఐజి డి రూపపై పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ ప్రశంసలు కురిపించారు. ‘రూప లాంటి నిజాయితీ గల అధికారులు మనకు అవసరం. యువత ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి’ అని కిరణ్‌బేడీ పిలుపునిచ్చారు. రూపను ప్రశంసిస్తూ ఆమె ట్వీట్ చేశారు. రూపలాంటి అధికారులు ఈ రోజుల్లో కనిపించడం లేదన్నారు. శశికళ నుంచి రెండు కోట్ల రూపాయలు తీసుకుని ప్రత్యేక సదుపాయాలు కల్పించారని రూప బయటపెట్టారు.