జాతీయ వార్తలు

కలసి వుంటే కలదు సుఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: ‘కలసి వుంటే కలదు సుఖం. విడిపోతే మనకే నష్టం’ అంటూ నీతీశ్, లాలూకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా కౌనె్సలింగ్ ఇచ్చారు. బీహార్‌లోని ‘మహాఘటబంధన్’ తెగిపోయే పరిణామాలు తలెత్తిన తరుణంలో సోనియా జోక్యం చేసుకొని ఇద్దరు నేతలతో శుక్రవారం ఫోన్‌లో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. సిబిఐ అభియోగాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై జెడి (యు) వొత్తిడి పెంచటంతో అధికారపక్షాల మధ్య చీలికలు వచ్చేసే పరిస్థితి వచ్చింది. బీహార్‌లో అధికార భాగస్వామ్య పక్షాలైన జెడి (యు), ఆర్జేడీ, కాంగ్రెస్‌లు కుదుపునకు గురయ్యాయి. పాట్నాలో ఇద్దరు వ్యాపారులకు భూముల బదలాయింపు, రాంచి, పూరీ ప్రాంతాల్లో ఐఆర్‌సిటిసి హోటళ్ల నిర్వహణకు లాలూ రైల్వే మంత్రిగా ఉన్నపుడే అనుమతులు ఇప్పించడం లాంటి ఘటనల్లో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్, భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, కుమారుడు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, కుమార్తె మీసాభారతి అభియోగాలు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఈ వివాదంతో మూడుపార్టీల కూటమి ‘మహాఘటబంధన్’ చీలిపోయే పరిణామాలు ఒక్కొక్కటిగా తలెత్తాయి. మరోపక్క ప్రభుత్వంపై బిజెపి ఆరోపణలు గుప్పిస్తుండటంతో, నిజాయతీని నిరూపించుకున్న తరువాతే రావాలంటూ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఒత్తిడి పెంచడం, ఆయన రాజీనామాకు జెడి (యు) నుంచి డిమాండ్లు రావడంతో వివాదం మరింత ముదిరింది.
కొద్దిరోజులుగా సాగుతోన్న వివాదాన్ని చల్చార్చేందుకు శుక్రవారం సిఎం నితీశ్‌కుమార్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో సోనియాగాంధీ ఫోన్‌లో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇద్దరు నేతలకు కౌన్సిలింగ్ చేస్తూ ‘ప్రస్తుత పరిస్థితుల్లో తగవు పెంచుకోవడం ప్రమాదం’ అని సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ‘పరిణామాలు కొద్ది రోజుల్లోనే సర్దుకుంటాయి’ అని ఇద్దరు నేతలు సోనియాకు చెప్పినట్టు సమాచారం.