జాతీయ వార్తలు

బయట శక్తుల పనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: జమ్మూకాశ్మీర్‌లో శాంతి భద్రతలు, అమర్‌నాథ్ యాత్రికులకు రక్షణ వంటి కీలక అంశాలపై కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ శనివారం ఇక్కడ చర్చించారు. అరగంట సేపుజరిగిన సమావేశంలో జమ్మూకాశ్మీర్‌లోని తాజా పరిస్థితులను రాజ్‌నాథ్‌కు వివరించినట్టు అధికార వర్గాలు వెల్లడించారు. ముఖ్యంగా కాశ్మీర్ లోయలో శాంతి నెలకొల్పడానికి తీసుకోవల్సిన చర్యలపై ఇరువురు నేతల మధ్య చర్చకు వచ్చింది. బయటశక్తులే రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయని మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. దురదృష్టవశాత్తూ చైనా అనవసర జోక్యంతో అనిశ్చిత పరిస్థితులు తలెత్తుతున్నాయనిన ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అయితే యావత్ భారత్, రాజకీయ పార్టీలు, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల వల్ల పరిస్థితి అదుపులోనే ఉందని మెహబూబా సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ఈ సమావేశంలో అమర్‌నాథ్ యాత్రికుల భద్రత, యాత్రకు ఎలాంటి అవరోధాలు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇటీవల అమర్‌నాథ్ యాత్రపై జరిగిన మిలిటెంట్ల దాడిలో ఏడుగురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో భద్రతాచర్యలు మరింత పటిష్టంగా అమలుచేయాలని నిర్ణయించారు. అమర్‌నాథ్ ఆలయాన్ని ఇప్పటి వరకూ 1.86 మంది భక్తులు దర్శించుకున్నారు. యాత్ర సాగే మార్గంలో 21వేల మంది పారామిలటరీ సిబ్బంది, రెండు బెటాలియన్ల ఆర్మీ, రాష్ట్ర పోలీసులను మోహరించారు. గత ఏడాదికంటే అదనంగా 9,500 మంది పారామిలటరీ సిబ్బందిని నియమించినట్టు అధికారులు వెల్లడించారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తరువాత పుల్వామా, కుల్‌గావ్, షోపియాన్, అనంత్‌నాగ్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. 2016 జూలై 8న వనీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ నాలుగు జిల్లాల్లో తలెత్తిన అనిశ్చిత పరిస్థితులు ఏప్రిల్‌లో జరిగిన శ్రీనగర్ లోక్‌సభ ఉప ఎన్నికలపై ప్రతికూల ప్రభావం చూపాయి.
పిడిపి ఎమ్మెల్యే డ్రైవర్ అరెస్టు
గత వారం అమర్‌నాథ్ యాత్రపై జరిగిన మిలిటెంట్ల దాడికి సంబంధించి అధికార పిడిపి ఎమ్మెల్యే ఐజాజ్ అహ్మద్ మిర్ కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టుచేశారు. జమ్మూకాశ్మీర్ పోలీసుశాఖలో సెక్యురిటీ వింగ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తౌసీఫ్ అహ్మద్ ఎమ్మెల్యే వద్ద డ్రైవర్‌గా ఉన్నాడు. తీవ్రవాద కార్యకలాపాలతో అహ్మద్‌కు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో విచారించేందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడు నెలల క్రితమే పిడిపి ఎమ్మెల్యే ఐజాజ్ వద్ద అతడు డ్రైవర్‌గా నియమితుడయ్యాడు. ఉగ్రవాదులతో డ్రైవర్‌కు ప్రత్యక్ష సంబంధాలున్నాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.