జాతీయ వార్తలు

ఆమోదానికి 18బిల్లులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదానికి మొత్తం 18బిల్లులు ఆమోదానికి రానున్నాయి. ప్రజావేగు పరిరక్షణ సవరణ బిల్లు, బిసిల జాతీయ కమిషన్ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొంది ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యసభ లిస్టింగ్‌లో ఈ బిల్లులు ఉన్నాయి. వీటితో పాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ బిల్లు, అవినీతి నిరోధక సవరణ బిల్లు, పౌరసత్వ బిల్లు తదితరాలు ఆమోదానికి సిద్ధంగా ఉన్నాయి. మొత్తం పదహారు బిల్లులు ప్రవేశపెట్టడానికి, పరిశీలనకు, ఆమోదానికి లిస్ట్ అయ్యాయి. జూలై 17 నుంచి ఆగస్టు 11 వరకు వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. 23వ తేదీన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ఉభయసభలూ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో వీడ్కోలు తెలుపుతాయి. లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్, ప్రధానిమోదీ ఈ సభలో మాట్లాడతారు. రాష్టప్రతికి ఒక జ్ఞాపికను, ఎంపిలు అందరూ సంతకాలు చేసిన ఒక పుస్తకాన్ని బహూకరిస్తారు. జూలై 25తో రాష్టప్రతి ప్రణబ్ పదవీకాలం ముగియనుంది. అదే రోజు కొత్త రాష్టప్రతి బాధ్యతలు స్వీకరిస్తారు.
ఉజ్వల్ యోజన భేష్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఉజ్వల్ ఎల్‌పిజి యోజన లబ్ధిదారుల సంఖ్య 2.5కోట్లకు చేరుకోవటం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం హర్షం వ్యక్తం చేశారు. మూడేళ్లలో 5కోట్లమంది పేద మహిళలకు ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చే ఈ స్కీం అద్భుతమైన పురోగతి సాధించిందని మోదీ ట్వీట్ చేశారు.
రెండోరోజూ చైనాపై అఖిలపక్షం
సిక్కింలోని చైనా సరిహద్దుల్లో పరిస్థితిపై ప్రభుత్వం ప్రతిపక్షాలకు శనివారం వరుసగా రెండోరోజు వివరణ ఇచ్చింది. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, సిపి ఐ నేత డి రాజలతో పాటు మొత్తం 11పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, రక్షణమంత్రి అరుణ్‌జైట్లీ, విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జయశంకర్‌లు పరిస్థితిపై విపక్షాలకు ఒక స్పష్టతనిచ్చారు. వీలైనం త్వరగా భారత చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తొలగించాలని విపక్ష నేతలు ప్రభుత్వాన్ని కోరారు.