జాతీయ వార్తలు

16 మంది యాత్రికులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంబాన్/జమ్మూ, జూలై 16: అమర్‌నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఏడుగురు యాత్రికులను పొట్టన పెట్టుకున్న ఘటన మరువక ముందే మరో విషాదం చోటు చేసుకొంది. అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు ఒకటి జమ్మూ, కాశ్మీర్‌లోని రాంబాన్ జిల్లాలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై అదుపు తప్పి ఒక లోయలో పడిపోవడంతో 16 మంది యాత్రికులు మృతి చెందగా, మరో 27 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 19 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్లో జమ్మూకు తీసుకు వచ్చారు. మిగతా ఎనిమిది మందిని బనీహాల్‌లోని జిల్లా అస్పత్రిలో చేర్చి చికత్స అందిస్తున్నారు.
మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో అమరనాథ్ యాత్రికుసలతో వస్తున్న జమ్మూ, కాశ్మీర్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు ఒకటి రాంబాన్ సమీపంలోని నచ్‌లానా వద్ద జమ్మూ-శ్రీనగర్ హైవేపై అదుపు తప్పి పల్టీలు కొడుతూ లోతయిన లోయలోకి పడిపోయినట్లు సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (ఎస్‌ఎస్‌పి) మోహన్‌లాల్ చెప్పారు. మృతులంతా కూడా ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, అసోం, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారని ఆయన చెప్పారు.మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. జమ్మూనుంచి 3,603 మంది అమర్‌నాథ్ యాత్రికులను బల్తాల్, పహల్‌గాం బేస్ క్యాంప్‌లకు తీసుకు వెళ్తున్న కాన్వాయ్‌లో ఈ బస్సు ఉంది. స్థానికుల సాయంతో పోలీసులు, సైన్యం, సిఆర్‌పిఎఫ్ జవాన్లు హుటాహుటిన సహాయక కార్యక్రమాలను చేపట్టి లోయలోంచి మృతదేహాలను, క్షతగాత్రులను బైటికి తీసుకు వచ్చినట్లు పోలీసు అధికారులు చెప్పారు.
అత్యంత బాధాకరం: మోదీ
ఇదిలా ఉండగా జమ్మూ, కాశ్మీర్‌లో ఆదివారం అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 16 మంది యాత్రికులు మృతి చెందిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేవారు. ఈ సంఘటన అత్యంత బాధాకరమైనదని ఆయన అంటూ, మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు మోదీ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్‌లో కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, గవర్నర్ ఎన్‌ఎన్ వోరాలకు ఫోన్ చేసి బస్సు ప్రమాదంపై పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ప్రమాద స్థలికి చేరుకున్న గవర్నర్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. కాగా, బస్సులో ప్రయాణిస్తున్న యాత్రీకుల వివరాలు తెలుసుకోవడం కోసం ప్రభుత్వం ఒక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది.

చిత్రం.. లోయలో పడిన క్షతగాత్రులను బయటికి తీస్తున్న సహాయక సిబ్బంది