జాతీయ వార్తలు

1947 వరకూ బతికేవున్న బోస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూలై 16: దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో కలలుగన్న ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎలా మరణించారు? ఈ ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనేందుకు భారత ప్రభుత్వం మూడు కమిషన్లను నియమించింది. వీటిలో షా నవాజ్ కమిటీ (1956), ఖోస్లా కమిషన్ (1970) జపాన్ ఆక్రమిత తైపీలోని తైహొకు విమానాశ్రయంలో 1945 ఆగస్టు 18వ తేదీన జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించారని తేల్చగా, విమాన ప్రమాదంలో బోస్ మరణించలేదని ముఖర్జీ కమిషన్ (1999) స్పష్టం చేసింది. అయితే ముఖర్జీ కమిషన్ అభిప్రాయాలను ప్రభుత్వం తోసిపుచ్చింది. అయినప్పటికీ బోస్ మరణం వెనుక దాగివున్న నిజాన్ని అనే్వషించకుండా పరిశోధకులను ఎవరూ ఆపలేకపోయారు. ఇటువంటి పరిశోధకుల్లో పారిస్‌కు చెందిన ప్రముఖ చరిత్రకారుడు జెబిపి.మోర్ ఒకరు. అందరూ అనుకుంటున్నట్లుగా బోస్ విమాన ప్రమాదంలో మరణించలేదని, 1947 వరకు ఆయన జీవించే ఉన్నారని మోర్ స్పష్టం చేశారు. 1947 డిసెంబర్ 11వ తేదీతో ఉన్న ఫ్రాన్స్ గూఢచార విభాగం నివేదికను ఆధారంగా చేసుకుని ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నివేదిక ఇటీవలే వెలుగులోకి వచ్చింది. తైవాన్ విమాన ప్రమాదంలో బోస్ మరణించినట్లు ఈ నివేదికలో లేదని, పైపెచ్చు 1947 చివరివరకూ బోస్ జీవించే ఉన్నారని, అయితే ఆయన ఎక్కడ ఉన్నారో తెలియలేదని ఆ నివేదికలో ఉందని, దీనిని బట్టి చూస్తుంటే బోస్ 1945 ఆగస్టు 18వ తేదీన మరణించలేదన్న విషయం స్పష్టమవుతోందని మూర్ పేర్కొన్నారు.