జాతీయ వార్తలు

ఓటింగ్‌కు అనర్హులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: ఉత్తరాఖండ్‌లో అనర్హత వేటుకు గురైన 9 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర శాసనసభలో తమను అనర్హులుగా ప్రకటించడాన్ని సవాలుచేస్తూ వీరు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం డిస్మిస్ చేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్‌కు పెద్ద ఊరట కల్పించింది. అంతేకాకుండా అనర్హత వేటుకు గురైన తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం రాష్ట్ర శాసనసభలో జరిగే బలపరీక్షలో పాల్గొనేందుకు వీల్లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేస్తూ ఈ అంశంపై తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేసింది. ఉత్తరాఖండ్ శాసనసభలో హరీష్ రావత్ మెజార్టీ సభ్యుల విశ్వాసాన్ని కలిగి ఉన్నాడా? లేదా? అనే విషయాన్ని తేల్చేందుకు మంగళవారం బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తీర్పు హరీష్ రావత్‌కు ఊరట కలిగించే విధంగా ఉండటంతో కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నిరాశ తప్పలేదు.
రాష్ట్ర శాసనసభలో తమను అనర్హులుగా ప్రకటించడాన్ని సవాలుచేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన తొమ్మిది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వారి పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు సోమవారం ఉదయం అంగీకరించింది. అంతకుముందు ఈ ఎమ్మెల్యేలు దాఖలు చేసుకున్న ఇదేవిధమైన పిటిషన్‌ను ఉత్తరాఖండ్ హైకోర్టు సోమవారం ఉదయం డిస్మిస్ చేయడంతో కొద్ది నిమిషాలకే వీరంతా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
అనర్హత వేటును సవాలు సవాలుచేస్తూ అంతకుముందు వీరు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను నైనిటాల్ హైకోర్టు బెంచ్ సింగిల్ జడ్జి జస్టిస్ యుసి.్ధ్యనీ డిస్మిస్ చేశారు. ఈ వ్యవహారంలో సదరు ఎమ్మెల్యేలు కావాలనుకుంటే రాష్ట్ర శాసనసభ స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్‌వాల్‌ను ఆశ్రయించి అనర్హత వేటు నిర్ణయంపై పునస్సమీక్ష జరపాల్సిందిగా కోరుకోవచ్చని జస్టిస్ ధ్యానీ సూచించారు.
ఈ తీర్పుతో బిజెపికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విధించడాన్ని సుప్రీం కోర్టు కూడా సమర్ధించడంతో ప్రస్తుతం ఉత్తరాఖండ్ శాసనసభలో బిజెపి బలం 28 మంది సభ్యులకు పడిపోయింది. ఈ సభ్యుల్లో భీమ్‌లాల్ ఆర్యా కూడా ఒకరు. బిజెపి నుంచి సస్పెన్షన్‌కు గురైన భీమ్‌లాల్ ఆర్యా ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో ఆ పార్టీకే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మంగళవారం జరిగే విశ్వాస పరీక్షలో ఆయన బిజెపి మద్దతు తెలుపుతాడా? లేదా? అనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలావుంటే, తొమ్మిది మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటును సుప్రీం కోర్టు సమర్ధించడం మంగళవారం శాసనసభలో బలపరీక్షను ఎదుర్కోబోతున్న రావత్‌కు ఎంతో సానుకూల అంశంగా పరిణమించింది. ప్రస్తుతం మొత్తం 62 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ శాసనసభలో రావత్ విశ్వాస పరీక్ష నెగ్గేందుకు 31 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపితే సరిపోతుంది.