జాతీయ వార్తలు

పలు రైళ్లు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 17: ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాయగడ-టిట్లాఘర్ మధ్య రైల్వే బ్రిడ్జి వరద నీటికి కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో నడిచే రైళ్ళన్నీ సోమవారం రద్దయ్యాయి. మరికొన్ని మళ్ళింపు మార్గంలో నడుస్తున్నాయి.
రద్దయిన ఎక్స్‌ప్రెస్‌లు
సంబల్‌పూర్-నాందేడ్ (12755), నాందేడ్-సంబల్‌పూర్ (12756), విశాఖపట్నం-కోర్బా (18518), కోర్బా-విశాఖపట్నం (18517) ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్టు వాల్తేరు డివిజన్ అధికారులు ప్రకటించారు.
మళ్ళింపు మార్గంలో నడిచేవి
తిరుపతి-బిలాస్‌పూర్ (17482), యశ్వంత్‌పూర్-టాటా ఎక్స్‌ప్రెస్ (18112), హటియా-ఎర్నాకులం (22837), అహ్మదాబాద్-పూరి (12844), అలప్పుజా-్ధన్‌బాద్ (13352) రైళ్లను దారి మళ్లించారు.
పాక్షికంగా రద్దయినవి
భువనేశ్వర్-జునాగర్ రోడ్డు ఎక్స్‌ప్రెస్ (18437), జునాగర్ రోడ్డు-్భవనేశ్వర్ (18438) ఎక్స్‌ప్రెస్ రైలును పాక్షికంగా రద్దు చేశారు.
రీ షెడ్యూల్ చేసినవి
విశాఖపట్నం-హజరత్ (12803), విశాఖపట్నం-తిరుపతి (08573) రైళ్లను రీషెడ్యూల్ చేశారు.