జాతీయ వార్తలు

ప్రైవసీ...ప్రాథమిక హక్కా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: ప్రైవసీ (వ్యక్తిగత గోప్యత) భారత రాజ్యాంగం నిర్థేశించిన ప్రాధమిక హక్కుల పరిధిలోకి వస్తుందా? అన్న అంశాన్ని నిర్ణయించడానికి తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం నిర్ణయించింది. ఆదాయం పన్ను చట్టంలోని 139 ఎఎ సెక్షన్ ప్రకారం ఆధార్‌ను పాన్‌తో అనుసంధానం చేయడం వల్ల పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందంటూ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఐదుకురు సభ్యుల ధర్మాసనం ఈ అంశాన్ని చేపట్టింది. ఆధార్‌ను పాన్‌తో అనుసంధానం చేయడం ప్రైవసీకి భంగం కలిగించినట్టు అవుతుందా అనే అంశాన్ని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం నిగ్గుదేలుస్తుంది. ఈ అంశంపై బుధవారం విచారణ జరుగుతుంది. ఆధార్‌తో పాన్‌ను అనుసంధానం చేయడం వల్ల ప్రైవసీకి భంగం కలుగుతుందన్న ఆందోళనల కారణంగా ఆధార్-పాన్ అనుసంధానంపై సుప్రీం కోర్టు పాక్షికంగా స్టే విధించిన విషయం తెలిసిందే.