జాతీయ వార్తలు

‘పరప్పన’ అక్రమాలపై రిటైర్డ్ ఐఏఎస్ దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 18: పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో అన్నాడిఎంకె (అమ్మ) పార్టీ అధినేత్రి వికె శశికళకు భారీ ఎత్తున ముడుపులు తీసుకొని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపైన, అలాగే జైల్లో చోటు చేసుకొంటున్న ఇతర అక్రమాలపైన దర్యాప్తు జరపడానికి కర్నాటక ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్‌ను నియమించింది. పరప్పన అఅగహార సెంట్రల్ జైల్లో శశికళతోపాటుగా మరి కొందరికి ప్రత్యేక సదుపాయాలు కల్పించారంటూ జైళ్ల విభాగం డిఐజి డి.రూప తన నివేదికలో పేర్కొన్న తర్వాత ఈ ఆరోపణలపై విచారణ జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం కుమార్‌ను నియమించింది. అయితే ఈ నివేదిక లీక్ కావడంతో రూపను సోమవారం జైళ్ల శాఖనుంచి వేరే శాఖకు బదిలీ చేయడం తెలిసిందే.