జాతీయ వార్తలు

ప్రత్యేక జెండాకోసం కర్నాటక కసరత్తు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు/న్యూఢిల్లీ, జూలై 18: రాష్ట్రానికి ప్రత్యేకంగా ఓ జెండాను రూపొందించుకునే చర్యలను కర్నాటక ప్రభుత్వం చేపట్టింది. ఈ చర్య వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. ఏ రాష్టమ్రూ సొంత జెండాను కలిగి ఉండకూడదన్న నిబంధన రాజ్యాంగంలో ఉందా అని ఆయన ప్రశ్నించారు. అలాంటప్పుడు దీనిపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఏ రాష్ట్రానికా రాష్ట్రం ప్రత్యేక జెండాను రూపొందించుకునే అవకాశం భారత రాజ్యాంగంలో లేదని, త్రివర్ణ పతాకమొక్కటే అందరి జెండా అని కేంద్రం స్పష్టం చేసింది. ‘మనది ఒకే దేశం.. ఒకే జెండా. అయితే ఏ రాష్టమ్రైనా సొంత జెండా కలిగి ఉండడాన్ని లేదా అలాంటి ప్రయత్నాన్ని నిషేధించే న్యాయపరమైన నిబంధన ఏమీ లేదు’ అని హోం శాఖ ప్రతినిధి వివరించారు. కాగా, వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ప్రత్యేక జెండాను రూపొందించేందుకు 9మంది సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి కర్నాటకకు ప్రత్యేక జెండా వస్తే దేశంలోనే ఇది సాధించిన రెండో రాష్ట్రం అవుతుంది. రాజ్యాంగంలోని 370 అధికరణ కింద ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన కాశ్మీర్‌కు మాత్రమే ఇప్పటివరకూ ప్రత్యేక జెండా ఉంది.