జాతీయ వార్తలు

రైతు సమస్యలపై నినదించిన విపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలతోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు గురువారం కూడా రైతుల సమస్యలపై లోక్‌సభను స్తంభింపజేశారు. ‘సభ సజావుగా జరగడం మీకు ఇష్టం లేదు, చర్చకు ప్రభుత్వం సిద్ధమని చెబుతున్నా మీరు మాత్రం సభను స్తంభింపజేసేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు’ అని లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చురకలు అంటించారు. అయానా ఏమాత్రం వెనక్కు తగ్గని కాంగ్రెస్, దాని మిత్రపక్షాల సభ్యులు పోడియం వద్ద నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ పనె్నండు గంటల పదిహేను నిమిషాలకు సభను శుక్రవారం ఉదయానికి వాయిదా వేయక తప్పలేదు. ఉదయం పదకొండు గంటలకు సభ సమావేశం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టేందుకు స్పీకర్ సిద్ధమయ్యారు. వెంటనే ప్రతిపక్షం సభ్యులు తమ సీట్లలో నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వటం ప్రారంభించారు. జీరో అవర్‌లో అందరికి మాట్లాడే అవకాశం ఇస్తానని స్పీకర్ హామీ ఇచ్చినా ఫలితం కనిపించలేదు. అప్పటికే పోడి యం వద్దకు వచ్చిన ప్రతిపక్షం సభ్యులు ప్రభుత్వానకి వ్యతిరేకంగా ఇచ్చిన నినాదలతో సభ మారుమోగింది. రైతులు గిట్టుబడు ధరలు లభించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, కరవు మూలంగా దేశంలోని పలు ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవటం దురదృష్టకరమంటూ ప్రతిపక్షం సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలిచ్చారు. సుమిత్రా మహాజన్ ఈ గందరగోళం మధ్యనే ప్రశోత్తరాల కార్యక్రమాన్ని ముందుకు సాగించేందుకు ప్రయత్నించారు. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తమ శాఖకు సంబంధించిన ఒక ప్రశ్నకు గం దరకోళం మధ్యలోనే సమాధానం ఇచ్చారు. అయితే ప్రతిపక్షం గొడవ బాగా పెరిగిపోవటంతో సభను 11.30 వరకు వాయిదా వేశారు. లోక్‌సభ తిరిగి సమావేశమైన తరువాత కూడా సభ శాంతించలేదు. దీంతో సభ ను పనె్నండు గంటల వరకు వాయిదా వేశారు. 12 గంటలకు సమావేశమైన తరువాత కూడా ప్రతిపక్షం సభ్యులు రైతుల సమస్యలపై గొడవ చేస్తూనే ఉన్నారు. ఆ సమయంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పింపజేశారు. అప్పటికే పోడియం వద్దకు దూసుకువచ్చిన ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం ప్రారంభించారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కేంద్రం నిమ్మకు నీరెత్టినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవటం లేదు, వారి సమస్యలను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు. దీనితో సభ పూర్తి గందరగోళంలోపడిపోయింది.సుమిత్రా మహాజన్ ఎంతగా నచ్చజెప్పినా ప్రతిపక్ష సభ్యులు ఏమాత్రం పట్టించుకోకుండా సభా కార్యక్రమాలకు అడ్డుతగిలారు. ఈ పరిస్థితిలో సుమిత్రా మహాజన్ లోక్‌సభను శుక్రవారం ఉదయం పదకొండు గంటల వరకు వాయిదా వేసి వెళ్లిపోయారు.

చిత్రం.. పోడియం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిస్తూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాల సభ్యులు