జాతీయ వార్తలు

4జియో ఫోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిలయెన్స్ మరో సంచలనానికి శ్రీకారం చుట్టింది. జియో సిమ్‌లతో దేశ ప్రజల్ని విశేషంగా ఆకర్షించిన ముఖేష్ అంబానీ జన సామాన్యానికి అందుబాటులో ఉండేలా 4జి ఫీచర్ ఫోన్ ఆవిష్కరించారు. ప్రధాని మోదీ మేడ్ ఇన్ ఇండియా లక్ష్యానికి ఊతాన్నిచ్చే రీతిలో భారతీయులే రూపొందించిన సామాన్యుడి ఫోన్ వాయిస్ కమాండ్‌తో పని చేస్తుంది. జీవితకాల ఉచిత వాయిస్ కాల్స్‌తోపాటు అపరిమితమైన డేటాను అందిస్తుంది. నెలకు 153 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే చాలు. ఉచితంగానే ఈ ఫోన్‌ను అందిస్తున్నా, సెక్యూరిటీ డిపాజిట్ కింద 1500 కట్టాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత ఫోన్ వెనక్కి ఇచ్చేస్తే డిపాజిట్ వాపస్ అవుతుంది. 50 కోట్ల మంది దిగువ ఆదాయ వర్గాలను లక్ష్యంగా చేసుకునే రిలయెన్స్ సంస్థ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. జియోతో 125 మిలియన్ మంది భారతీయుల్ని ఆకట్టుకోగలిగిన రిలయెన్స్, ఇప్పుడు కొత్త ఫీచర్లు కలిగిన 4జి ఫోన్‌తో మరింతగా టెలికాం మార్కెట్‌లోకి దూసుకుపోబోతోంది. ఆగస్టు 24నుంచి ప్రీ బుకింగ్స్ మొదలవుతాయి. సెప్టెంబర్ నుంచి ఎవరు ముందు వస్తే వారికీ ఈ ఫోన్ అందుతుంది. అన్ని జియో ఫోన్‌లనూ భారత్‌లోనే తయారు చేస్తామని వెల్లడించిన అంబానీ, ప్రతివారం 5 మిలియన్ ఫోన్లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.