జాతీయ వార్తలు

యుఆర్ రావు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: ప్రఖ్యాత శాస్తవ్రేత్త, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ ఉడిపి రామచంద్రరావు(85) సోమవారం కన్నుమూశారు. ఇక్కడి తన స్వగృహంలో తెల్లవారుజామున 3 గంటలకు రామచంద్రరావు తుదిశ్వాస విడిచారు. కర్నాటకలోని ఉడిపి జిల్లా అడమారుకు చెందిన రామచంద్రరావు ఇస్రోకు వివిధ హోదాల్లో చివరివరకు సేవలందించారు. ఇస్రో చైర్మన్‌గా 1984 నుంచి 1994 వరకు సేవలందించారు. రామచంద్రరావు నేతృత్వంలో ఇస్రో కొత్తపుంతలు తొక్కింది. రాకెట్ టెక్నాలజీ అభివృద్ధికి రామచంద్రరావు చేసిన కృషి ఫలితంగా ఎఎస్‌ఎల్‌వి రాకెట్, పిఎస్‌ఎల్‌వి లాంచ్ వెహికిల్స్ ప్రయాగాలు విజవంతమయ్యాయి. జియో స్టేషనరీ లాంచ్ వెహికిల్స్, క్రయోజనిక్ టెక్నాలజీ అభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారు. రామచంద్రరావు సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1976లో పద్మభూషణ్, 2017లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. యుఆర్ రావుగా ప్రసిద్ధి చెందిన రామచంద్రరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రిసెర్చ్ లేబొరేటరీ గవర్నింగ్ కౌన్సిల్‌కి చైర్మన్‌గా, తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చాన్స్‌లర్‌గా ఉన్నారు.