జాతీయ వార్తలు

కోవింద్ ఇంట సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, జూలై 24: భారత కొత్త రాష్టప్రతిగా రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్న సందర్భంగా ఆయన చదువుకున్న కాలేజీలో పండుగ వాతావరణం నెలకొంది. 14వ రాష్టప్రతిగా మంగళవారం కోవింద్ ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. కాన్పూర్‌లో కోవింద్ చదువుకున్న ఇంటర్ కాలేజీలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. బిఎన్‌ఎస్‌డి ఇంటర్ కాలేజీలో భారీ ఎత్తున విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు యాజమాన్యం వెల్లడించింది. రాష్టప్రతి భవన్‌లో రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు కళాశాల ప్రాంగణంలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అందరూ వేడుకల్లో భాగస్వాములవుతున్నారు. కాలేజీలోనూ, బయట కూడా స్వీట్లు పంచుతామని ప్రిన్సిపాల్ ఆర్‌సి సింగ్ వెల్లడించారు. బిజెపి కార్యకర్తలయితే నగరంలో బుధవారం ‘గౌరవ్ దివస్’గా పాటించనుంది. ఆ రోజు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు బిజెపి నగర అధ్యక్షుడు సురేంద్ర మైతాని వెల్లడించారు. మరోపక్క కోవింద్ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఎనిమిది మంది శరణ్ శక్తి ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రామ్‌నాథ్ కోవింద్ పెద్దన్నయ్య ప్యారేలాల్, కోడలు విద్యావతి, కజిన్స్ దీపక్, పంకజ్, శివకుమార్, హేమలత, కమలేశ్, పెద్దన్నయ్య అల్లుడు అలోక్ రాజధానికి పయనమయ్యారు. రాష్టప్రతి భవన్‌లో జరిగే కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వారంతా హాజరవుతారు. ఆయనకు అత్యంత ఇష్టమైన వంటకాలు తయారుచేసుకుని ఢిల్లీ వెళ్లారు.