జాతీయ వార్తలు

ఎన్‌ఐఏ అదుపులో ఏడుగురు వేర్పాటువాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్/న్యూఢిల్లీ, జూలై 24: జమ్మూకాశ్మీర్‌లో మిలిటెంట్ కార్యకలాపాలకు ఉగ్రవాద సంస్థల నుంచి నిధుల సమీకణ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఏడుగురు వేర్పాటువాదులను అరెస్టు చేసింది. హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ సయ్యద్ అలీషా గిలానీ అల్లుడు అల్త్ఫా అహ్మద్ షా అరెస్టయినవారిలో ఉన్నాడు. కాశ్మీర్ లోయలో తీవ్రవాద కార్యకలాపాలకు నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయన్న దానిపై ఎన్‌ఐఏ దృషి సారించింది. అల్త్ఫాను జమ్మూకాశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్ని ప్రశ్నిస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. స్థానికులకు అతడు అల్త్ఫా ఫాంటూష్‌గా సుపరిచితుడు. షాతోపాటు గిలానీకి అత్యంత సన్నిహితుడు, తెహ్రీక్ ఇ హురియత్ అధికార ప్రతినిధి అయాజ్ అక్బర్, పీర్ సైఫుల్లాను ఎన్‌ఐఏ పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరినీ కాశ్మీర్ లోయలోనే అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. అలాగే మిర్వైజ్ ఉమర్ ఫరూఖ్ నాయకత్వంలోని హురియత్ కాన్ఫరెన్స్(మోడరేట్) అధికార ప్రతినిధి షాహిద్ ఉల్ ఇస్లాంను అరెస్టు చేసినట్టు తెలిపారు. వేర్పాటువాద నేత గిలానీ వర్గానికి చెందిన మెహ్రాజుద్దీన్ కల్వాల్, నరుూమ్ ఖాన్‌లతోపాటు ఫరూక్ అహ్మద్ డర్ అలియాస్ ‘బిట్టా కరాటే’లను అరెస్టు చేశారు. అరెస్టయినవారి ఇళ్లపై గత నెలలో ఎన్‌ఐఏ విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్టు అధికారులు పేర్కొన్నారు. కాశ్మీర్‌లోయలో మిలిటెన్సిని ప్రోత్సహిస్తూ, అశాంతికి కారణమవుతున్న వేర్పాటువాదుల కదలికలపై దర్యాప్తు సంస్థ కనే్నసింది. కార్యకలాపాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నదానిపై నిఘా ఉంచింది. గిలానీ, మిర్వైజ్ హురియత్ గ్రూపులు, హిజ్బుల్ ముజాహిదీన్, దుఖాతరన్ ఇ మిలాత్ సంస్థలకు నిధుల రాకపై దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా పాక్ ఉగ్రవాద సంస్థ జమాత్ ఉల్ దవా చీఫ్ హఫీజ్ సరుూద్, నిషేదిత లష్కరే తొయిబాల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

చిత్రం.. . ఢిల్లీలోని లోక్‌నాయక్ భవన్‌లో భారీ అగిన్రపమాదం సంభవించడంతో మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది