జాతీయ వార్తలు

రాజ్యసభలో ఆర్కిటెక్ట్స్ బిల్లు ఉపసంహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: ఆర్కిటెక్ట్స్ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 1972కు చెందిన ఈ చట్టం సవరణకు సబంధించి గత ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. ఆర్కిటెక్ట్స్ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఈ బిల్లును ఉపసంహరించుకున్నట్టు కేంద్ర హెచ్‌ఆర్‌డి సహాయ మంత్రి మహేంద్రనాథ్ పాండే సోమవారం రాజ్యసభకు తెలిపారు. గత ప్రభుత్వం 2010లో దీన్ని రాజ్యసభలో ప్రతిపాదించింది. తరువాత పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ(హెచ్‌ఆర్‌డి) పరిశీలనకు పంపారు. ప్యానెల్ కమిటీ నుంచి ఇప్పటి వరకూ నివేదిక రాలేదు.