జాతీయ వార్తలు

భవిష్యత్‌ను గెలుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: ‘ఉమ్మడి ఆంధ్ర విభజనతో తెలుగు ప్రజలకు మేలే జరుగుతుంది. రెండు రాష్ట్రాలు గణనీయ అభివృద్ధి సాధిస్తాయి. సమీప భవిష్యత్‌లో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రాలుగా వృద్ధి సాధిస్తాయి’ అని తెలంగాణ సిఎం కె చంద్రశేఖర రావు జోస్యం చెప్పారు. తెరాస ప్రభుత్వాన్ని కూలదోసేందుకు జరిగిన కుట్రను భగ్నం చేశామన్నారు. ‘రెండు తెలుగు రాష్ట్రాలకు త్వరలోనే ఇద్దరు కొత్త గవర్నర్‌లు వస్తారన్నారు. తెరాస ప్రభుత్వ అస్థిత్వాన్ని దెబ్బతీయటం ద్వారా రాష్ట్రం ఏర్పాటు విఫలయత్నమని చూపేందుకు కుట్ర చేశారు. రాష్టప్రతి పాలన విధించాలన్న ప్రయత్నం జరిగింది. ఢిల్లీస్థాయిలో జరిగిన కుట్రను విజయవంతంగా తిప్పికొట్టానని కెసిఆర్ అన్నారు. ఈ కుయుక్తుల్లో భాగంగానే ఎమ్మెల్సీ కొనుగోలు జరిగింది. అందుకే ఏపీ ప్రభుత్వం అమరావతికి తరలిపోయేలా చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. మా ప్రభుత్వాన్ని కూలదోస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? అని ఆవేశంతో ప్రశ్నించారు. ఉద్యమ నేతగా తెలంగాణ రాజకీయ స్థిరత్వం కోసం ప్రయత్నిస్తుంటే, తన ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. ఏదేమైనా రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ది బాటన ముందుకు సాగాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య పొరపొచ్చాలను సునాయాసంగా పరిష్కరించొచ్చు. కృష్ణా, గోదావరి నదీ జలాలను సద్వినియోగం చేసుకోగలిగితే తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నారు. ‘ఈ ఏడాది 4వేల టిఎంసి గోదావరి జలాలు సముద్రం పాలయ్యాయి. ఈ జలాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చంద్రబాబుకు సూచించాం’ అన్నారు. తెలంగాణ ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రులు తన పరిపాలన పట్ల భయాందోళనలు వదిలి సంతృప్తితో ఉన్నారన్నారు. విభజన జరిగిన వెంటనే చంద్రబాబు అమరావతి నుంచి పాలన కొనసాగించివుంటే మరింత మంచి ప్రగతి సాధించి ఉండేవారని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాజధాని మూలంగా ఏపీకి ఒరిగిందేమీ లేదని కెసిఆర్ వ్యాఖ్యానించారు.
బిజెపి కాలు పెట్టలేదు
దక్షిణాదిలో అడుగు పెట్టేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమయ్యే ప్రసక్తే లేదని కెసిఆర్ స్పష్టం చేశారు. కేరళ, తమిళనాడు, తెలంగాణలో బిజెపికి ఎలాంటి స్థానం లేదు. మైనారిటీలు తక్కువగావున్న ఏపీలో అదృష్టాన్ని పరీక్షించుకోడానికి బిజెపి పావులు కదుపుతోంది అని విశే్లషించారు. ఏపీలోని బలమైన కాపువర్గంతో కలిసి వెళ్లేందుకు బిజెపి తెరవెనక ప్రయత్నాలు చేస్తోందనే అభిప్రాయాన్ని కెసిఆర్ వ్యక్తం చేశారు. ఏపీలో ప్రధానంగా పోటీ తెలుగుదేశం, వైకాపాల మధ్యే ఉంటుందన్నారు. ఇటీవల జరిగిన సర్వే ఫలితాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైకాపాకు 45 శాతం ప్రజలు మద్దతిస్తే, తెదేపాకు 43శాతం మంది మద్దతు ప్రకటించారని, బిజెపికి కేవలం రెండున్నర శాతం బలం ఉన్నట్టు వెళ్లడైందని కెసిఆర్ లెక్కలు చెప్పారు. సినీనటుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనకు కేవలం రెండు శాతం మద్దతు ఇవ్వటం గమనార్హమన్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ అనేది మంచి నినాదం కాదని కెసిఆర్ వ్యాఖ్యానించారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తూ తమ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై ప్రధాని నరేంద్రమోదీకి ఫిర్యాదు చేశామని కెసిఆర్ వెల్లడించారు. అమిత్ షా వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడిన విషయాన్ని ప్రధాని దృష్టికి తెచ్చామని సిఎం కెసిఆర్ వివరించారు.

చిత్రం.. కొత్త రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను గురువారం రాష్టప్రతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన సిఎం కెసిఆర్, పార్టీ ఎంపీలు