జాతీయ వార్తలు

ట్రిపుల్ ఐటిలకు రాజ్యాంగబద్ధత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: దేశంలోని ట్రిపుల్ ఐటిలకు రాజ్యాంగబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్ గురువారం ఆమోదించింది. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో వీటిని నిర్వహిస్తారు. అలాగే వీటిలో రిజర్వేషన్ విధానం అమలవుతుందని సభ్యులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. దేశంలోని 15 ట్రిపుల్ ఐటిలకు ఈ బిల్లుద్వారా రాజ్యాంగ బద్ధత లభించడంతోపాటు వీటిని జాతీయ ప్రాధాన్యత కలిగిన విద్యా కేంద్రాలుగా పరిగణిస్తారు. తాజా బిల్లుతో ఈ సంస్థలోని తమ విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేసే అధికారం లభిస్తుంది. ఈనెల 19న లోక్‌సభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. గురువారం నాడు రాజ్యసభ దీనికి మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఆధునిక భారత నిర్మాణానికి దోహదం చేసే ఈ బిల్లును బలపరచాల్సిందిగా హెచ్‌ఆర్‌డి సహాయ మంత్రి మహేంద్రనాథ్ పాండే విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ప్రవేశానికి సంబంధించి వీటిలో రిజర్వేషన్ల విధానం అమలవుతుందని సిపిఐ సభ్యుడు డి రాజా అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. కొందరు సభ్యులు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో‘ఈ బిల్లులోనే రిజర్వేషన్ కల్పన ప్రతిపాదన ఉంది. మీరెందుకు సందేహిస్తున్నారు? మంత్రి కూడా ఈ విషయంలో హామీ ఇచ్చారు. ఒక వేళ దీని ఉల్లంఘన జరిగితే సభలో నిలదీయవచ్చు’అని డిప్యూటీ చైర్మన్ పిజె కురియన్ స్పష్టం చేశారు. అనంతరం మూజువాణి ఓటుతో ఈ బిల్లును ఎగువసభ ఆమోదించింది. ఎలాంటి సవరణ లేకుండా కాంగ్రెస్ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి ప్రతిపాదించిన బిల్లు ఆమోదం పొందడం ఇదే మొదటిసారి అని కురియన్ చతురోక్తి విసిరారు. ఈ బిల్లుపై జరిగిన చర్చలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.