జాతీయ వార్తలు

కర్నాటక మాజీ సిఎం ధరమ్‌సింగ్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 27: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ధరమ్‌సింగ్ గురువారం ఇక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. 80 ఏళ్ల సింగ్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను నగరంలోకి ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించగా 40 నిముషాల తరువాత మరణించారు. గుండెపోటుతో ధరమ్‌సింగ్ చనిపోయారని వైద్యులు ప్రకటించారు. 2004-2006లో కర్నాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన ధరమ్‌సింగ్ కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సేవలందించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారు, కుమార్తె ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు దేవరాజ్ అర్స్, ఆర్ గుండూరావు, వీరప్పమొయిలీ, ఎస్‌ఎం కృష్ణ వద్ద కీలక పదవులు నిర్వర్తించారు.