జాతీయ వార్తలు

జయలేని లోటు తీర్చలేనిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామేశ్వరం, జూలై 27: జయలలిత లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఇది ఎవరూ తీర్చలేనిదని పేర్కొన్నారు. ఆమె భౌతికంగా మన మధ్యన లేకపోయినా జయలలిత ఆశీస్సులు మాత్రం ఎప్పుడూ ఇక్కడ ప్రజలకు ఉంటాయని ఆయన అన్నారు. రామేశ్వరంలో నిర్మించిన మాజీ రాష్టప్రతి ఎపిజె అబ్దుల్ కలామ్ మెమోరియల్ ప్రారంభోత్సవానికి గురువారం ఇక్కడి విచ్చేసిన ప్రధాని మోదీ మాట్లాడుతూ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె జయలలితను అమ్మగా సంబోధించారు. ఆమె ఇప్పుడు మనమధ్య లేకపోయినా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు జయలలిత ఆశీస్సులు మాత్రం ఎప్పుడూ ఉంటాయని అన్నారు. అమ్మ ఇప్పుడు మన మధ్య ఉండి కలామ్ మెమోరియల్ నిర్మాణానికి ఇక్కడి కార్మికులు పడ్డ కష్టాన్ని చూస్తే తప్పకుండా వారిని అభినందించేవారని మోదీ అన్నారు. అమ్మ మన మధ్య లేరన్న విషయం బాధాకరంగా ఉందని పేర్కొన్నారు. అమ్మ మరణం తర్వాత తాను ఇక్కడ సమావేశంలో పాల్గొనడం ఇదే మొదటిసారని, అమ్మ లేకపోయినా ఆమె ఆశీస్సులు ఎప్పుడూ ఇక్కడి ప్రజలకు ఉంటాయన్నారు. జయలలితకు ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు.

చిత్రం.. రామేశ్వరంలో గురువారం మాజీ రాష్టప్రతి ఎ.పి.జె.అబ్దుల్ కలాం స్మారక మ్యూజియంను ప్రారంభించి అందులోని కలాం విగ్రహాన్ని చూస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ