జాతీయ వార్తలు

ఆసేతుహిమాచలం కమలోత్సాహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా బిజెపి ఘనవిజయం సాధించే అవకాశాలు బిహార్ పరిణామాల నేపథ్యంలో మరింత బలపడ్డాయి. ఉత్తర, ప్రశ్చిమ, తూర్పు ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో బిజెపి ఇప్పటికే బలమైన శక్తిగా ఆవిర్భవించింది. ఇప్పుడు జెడి(యు) అధినేత నితీశ్‌కుమార్‌తో కలిసి బిహార్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో దేశ జనాభాలో 70 శాతం మందికి పైగా బిజెపి, దాని మిత్రపక్షాల అధికారంలోవున్న ఎన్డీయే పాలన కిందకు వచ్చేశాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఏకఛత్రాధిపత్యాన్ని చెలాయించిన రోజులను నేడు బిజెపి అధికార పరిధి గుర్తు చేస్తోంది. లోక్‌సభకు 20 అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఎంపీలను పంపే పనె్నండు రాష్ట్రాల్లో ఏడు రాష్ట్రాలు ఎన్డీయే కూటమి అధికార పరిధిలోనే ఉన్నాయి. మిగిలిన ఐదు బిజెపియేతర పార్టీల పాలనవున్న రాష్ట్రాల్లో అన్నాడిఎంకె, బిజెడిలు ఇప్పటికే బిజెపి అనుకూల సంకేతాలు అందించాయి. అన్నాడిఎంకె తమిళనాడులోను, బిజెడి ఒడిశాలోను అధికారంలో ఉన్నాయి. ఎప్పుడైతే బిజెపి అధికార పరిధి విస్తరించడం మొదలైందో కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం కూడా గత కొనే్నళ్లుగా తగ్గుతూ వస్తోంది. 130 సంవత్సరాల ఘనమైన రాజకీయ నేపథ్యం కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒక్క కర్నాటకలోనే అధికారంలో ఉంది. 2018లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు యెడ్యూరప్ప సారథ్యంలో బిజెపి అహరహం కృషి చేస్తోంది. కామ్‌రూప్ నుంచి కచ్ వరకూ, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అధికారంలోకి రావాలన్నది బిజెపి దీర్ఘకాల వ్యూహం. ఇందులో భాగంగానే గత కొనే్నళ్లుగా ఎన్డీయే కూటమి పాలనలోవున్న రాష్ట్రాల సంఖ్యను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తోంది. ఇప్పుడు నితీశ్‌కుమార్ ఎన్డీయే పంచన చేరడంతో బిజెపి విస్తృత లక్ష్యం సగానికి పైగా నెరవేరినట్టయ్యింది. బెంగాల్ వినా రెండు కీలక ప్రాంతాల్లో బిజెపి అధికారంలోకి వచ్చినట్టయింది. పశ్చిమ బెంగాల్‌లో తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్న మమతా బెనర్జీని ఎదుర్కొనే అవకాశాలు ఇప్పట్లో లేవనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దక్షిణాది విషయానికి వస్తే బిజెపికి అనుకున్నస్థాయిలో బలం లేదన్న బలమైన వాదన వినిపిస్తోంది. ఆంధ్రలో తెలుగుదేశం పార్టీతో కలిసి అధికారాన్ని పంచుకుంటోంది. తెలంగాణ, తమిళనాడులో అధికార పార్టీలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. కేరళ, పశ్చిమ బెంగాల్‌లో కాషాయ ప్రభావం ఇప్పటికీ బలమైన స్థాయిలో వేళ్లూనలేదన్నది వాస్తవం. సుపరిపాలన, నీతి నిజాయితీలకు పెట్టింది పేరుగావున్న నితీశ్‌కుమార్ ఇప్పుడు ఎన్డీయే కూటమికి రావడంతో 2019 ఎన్నికల్లో బిజెపి వ్యతిరేక మహాకూటమి ఏర్పాటు చేయాలన్న విపక్షాల ప్రయత్నాలకు తీవ్రవిఘాతం కలిగినట్టయింది. ఒకవేళ ఎన్డీయే కూటమిని ఎదుర్కొనే బలమైన విపక్షం ఏర్పడితే, దానికి సారథ్యం వహించేది ఎవరనేది కూడా అనుమానంగానే కనిపిస్తోంది. అఖిలేష్ యాదవ్ ముందుకొస్తారా? లేక మాయావతి, మమతలు ఈ సారథ్యాన్ని చేపడతారా? లేక లాలూ ప్రసాదే విపక్షాలను సమష్టిగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను భుజాన వేసుకుంటారా? అన్నది సమాధానం లేని ప్రశ్న. అయితే వీరిలో ఎవరూ కూడా ఎవరికీ ఆ స్థాయి రాజకీయ నిజాయితీ, మచ్చలేని నాయకత్వం లేదని వాదన ఎన్డీయే వర్గాలనుంచి వినిపిస్తోంది.