జాతీయ వార్తలు

సహాయక్ విధానం రద్దులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 28: సైన్యంలో సహాయక్ విధానాన్ని రద్దుచేసే ప్రతిపాదన లేదని కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి సుభాష్ భామ్రే లోక్‌సభకు చెప్పారు. సహాయక్ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘సహాయక్ విధానం రద్దు యోచన లేదు. దాని స్థానే మరొక విధానం తీసుకొచ్చే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదు’అని బదులిచ్చారు. సహాయక్ విధానం లేదా బుడ్డీ విధానం కింద సైనికుడిని అధికారి వద్ద నియమిస్తారు. అధికారి రక్షణ, ఆయుధాలు కాపలా, నిర్వహణ వంటి విధులు సైనికుడు నిర్వర్తిస్తాడు. గత కొంతకాలంగా సహాయక్ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌గా మారాయి. అధికారులు తమను బానిసల్లా చూస్తున్నారని జవాన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారుల వద్ద పనిచేయలేమని అనేక మంది జవాన్లు మొరపెట్టుకున్న సంఘటనలూ ఉన్నాయి. జవాన్ల ఫిర్యాదులపై దర్యాప్తు చేసి విధానంలో మార్పులు, చేర్పులు చేస్తామని మరొక ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. జవాన్ల ఆత్మహత్యలపై అధ్యయనం చేసిన మానసిక నిపుణులు కుటుంబ సమస్యలు, వైవాహిక సమస్యలు, వత్తిళ్లు, ఆర్థిక సమస్యలే కారణమని నివేదించారని మంత్రి స్పష్టం చేశారు.