జాతీయ వార్తలు

ప్రకాశం బ్యారేజీపై పిటిషన్ కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: విజయవాడ ప్రకాశం బ్యారేజీపై భారీ వాహనాలను అనుమంతించొద్దంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ టిఎస్ ఠాకుర్, జస్టిస్ ఆర్.్భనుమతి, జస్టిస్ యూవి లలిత్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. రామకృష్ణారెడ్డి తరరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రకాశం బ్యారేజీపై భారీ వాహనాలు అనుమంతించకుండా ఆదేశాలు జారీ చేయాలన్నారు. దీనికి ధర్మాసనం మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేనా.. అధికార పార్టీ ఎమ్మెల్యేనా అని ప్రశ్నించారు. దీనికి రామకృష్టా రెడ్డి తరపు న్యాయవాది ప్రతిపక్ష ఎమ్మెల్యే అని తెలిపారు. అయితే ఈ పిటిషన్ వెనుక రాజకీయ కోణం వుందని ధర్మాసనం భావిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే ప్రకాశం బ్యారేజీపై వాహనాల రాకపోకల ఉల్లంఘనలపై హైకోర్టు ఆశ్రయించాలని సుప్రీంకోర్టు పిటిషనర్‌కు సూచించింది.